సినిమా ఇండస్ట్రీకి ఏ అమ్మాయి వచ్చినా కూడా హీరోయిన్ అనేదే ఫస్ట్ టార్గెట్. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ, అందరిలో హీరోయిన్ అయ్యే మెటీరియల్ ఉండదు. కొందరు మోడల్స్‌గానే మిగిలిపోతారు. కొందరు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎన్నో కారణాల వల్ల వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోతారు. కొందరు హీరోయిన్‌గా సూటయ్యేవారైనా కూడా దర్శకులు వారిని ఐటెం సాంగ్స్‌కి సుటవుతారని ఫిక్సవుతారు. అదే కొందరి హీరోయిన్స్ కెరీర్‌ని దెబ్బ తీస్తుంది.
అలా హీరోయిన్ అవ్వాల్సిన అమ్మాయి ఐటెం సాంగ్స్‌కి పరిమితమైంది. ఇప్పుడు ఆ అవకాశాలు లేకుండా పోయాయి. దీనికి కారణం తను కెరీర్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోకపోవడమే. ఆమె లక్ష్మీ రాయ్. చివరికి పేరు కూడా మార్చుకుంది. లక్ష్మీ రాయ్ కాస్త రాయ్ లక్ష్మీగా మారింది. అదేదో చంద్రముఖి సినిమాలో మారినట్టుగా వారు వీరైతే కెరీర్ తిరగబడుతుందా..? అది అందరి విషయంలో జరగదు. ఈ లాజిక్ చాలామందికి తెలియకనే సినీ కెరీర్ కోసం నానా తంటాలు పడుతుంటారు..పడుతున్నారు.
లక్ష్మీ రాయ్ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్‌గా టాలీవుడ్‌కి కాంచన మాల కేబుల్ టీవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. శ్రీకాంత్ హీరో. అయితే, శ్రీకాంత్ కెరీర్ అంత సక్సెస్‌లో లేని సమయం.. అలాంటి హీరోతో హీరోయిన్‌గా ఎంట్రీ అంటే ఆ తర్వాత కెరీర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ సరసన అధినాయకుడు సినిమాలో నటించినా ఉపయోగం లేకుండా పోయింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ రూపొందించిన కాంచన సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత లక్ష్మీ రాయ్ కెరీర్ ఊపందుకుంటుందని అందరూ భావించారు. కానీ, అనుకున్నట్టు జరగలేదు. పేరు మార్చుకొని బాలీవుడ్‌లో దిగింది. జూలీ 2లో నటించింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తాయనుకుంది.
కానీ అక్కడ కూడా అమ్మడికి చుక్కెదురైంది. మెగా హీరోల సరసన ఐటెం సాంగ్స్ చేసింది డాన్స్ అద్భుతంగా చేసినా కెరీర్‌కి ఏమాత్రం అవి ఉపయోగపడలేదు. బాలీవుడ్ సహా మిగతా సౌత్ భాషలలోనూ హీరోయిన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. కానీ, ఇప్పుడు రాయ్ లక్ష్మీ కెరీర్ అనుకున్నట్టుగా సాగడం లేదు.