సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పర్సనల్ అంటూ ఏదీ లేకుండా పోతుంది. ప్రతి విషయాన్ని పబ్లిక్ గా మాట్లాడేస్తూ.. ప్రైవసీ అనే పదానికి ప్రైవసీ లేకుండా చేస్తున్నారు జనాలు. అంతేకాదు బోల్డ్ ఫోటోషూట్స్.. వల్గర్ చెత్త వీడియోలు పోస్ట్ చేస్తూ చిన్నపిల్లల్ని సైతం పాడు చేసేస్తున్నారు . చిన్న వయసు పిల్లలకే 25 వయసు అబ్బాయిలకు ఏం తెలియాలో అన్ని తెలిసేలా చేస్తుంది ఈ సోషల్ మీడియా. దీంతో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చి ఏం ఉపయోగం ఉందో ఎంత చెడిపోతున్నామో.. మనకు మనకే తెలియకుండా తయారయ్యే పరిస్థితి నెలకొంది.
కాగా సోషల్ మీడియా ద్వారా పలు మంచి విషయాలు కూడా స్ప్రెడ్ అవుతాయి అని ప్రూవ్ చేసింది మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత. మనకు తెలిసిందె సుస్మిత మహిళల విషయంలో ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది . తనదైన స్టైల్ లో ఏ విషయం పైన స్పందిస్తూ తనకు తగ్గ సలహాలను తన అభిప్రాయాలు ధైర్యంగా చెప్పుకొస్తుంది. రీసెంట్గా మహిళలకు మరింత ముఖ్యమైన పీరియడ్స్ విషయంలో ఆమె నోరు విప్పి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. . పీరియడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ‘పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్(ఫూఋఏ)’ అనే సంస్థ ‘ప్యూరథాన్-2022’లో భాగంగా ‘పీరియడ్ పావర్టీ రన్ ఈవెంట్’గా అక్టోబర్ 9న ఉదయం 6.30 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కర్టెన్ రైజర్‌లో భాగంగా పోస్టర్ విడుదల చేసిన సుస్మిత.. పీరియడ్స్ గురించి మహిళలు ధైర్యంగా మాట్లాడాలని కోరింది. అంతేకాదు కొందరు మహిళలు పీరియడ్స్ గురించి మాట్లాడడానికి ఇష్టపడరని అది ఎందుకో నాకు అర్థం కావట్లేదని అది దేవుడు పెట్టిన అదృష్టమని ఆ విషయంలో మనం బాధపడకూడదు అని చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో సుస్మిత మాట్లాడుతూ..” ఇలాంటి ఓ మంచి కార్యక్రమంలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పీరియడ్స్ అనేవి మహిళలకు సర్వసాధారణం . శరీర అభివృద్ధికి ఉపయోగపడతాయి. కాబట్టి వాటి గురించి తెలియని వాళ్లకు మనం తెలియజేయాలి. అందరికీ పీరియడ్స్ గురించి అవగాహన ఉంటుందని నేను అనుకోవడం లేదు తెలియని వారు కూడా ఉంటారు. అలాంటి వాళ్లకి నా మాటలు ఉపయోగపడితే చాలు. పీరియడ్స్ అవగాహన లేక ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పటికీ సమాజం ఇంత మెరుగుపడిన టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన పీరియడ్స్ గురించి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. కొందరు మహిళలు ఇబ్బంది పడతారు కానీ అది తప్పు అలా ఉండకండి .
ఏ విషయమైనా మీరు చెప్తేనే పక్క వాళ్లకు అర్థమవుతుంది . మనం శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలను బయట పెట్టాలి. అంతేకాదు భవిష్యత్తులో ఎంతోమంది అమ్మాయిలు భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తారు అలాంటివారి కోసం ఇలాంటి అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి ఇలాంటి మంచి విషయాలను సపోర్ట్ చేయడానికి అబ్బాయిలు ముందుకు రావడం నిజంగా గర్వకారణం” అంటూ ఆమె ప్రశంసించింది. దీంతో సుస్మిత మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు అమ్మాయిలు మహిళలు సుస్మిత మాటలకు ఫిదా అయిపోయారు. మెగా డాటర్ నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.