Moviesలైగ‌ర్ డిజాస్ట‌ర్ .. బాధ‌లో ఉన్న ఛార్మి కోసం విజ‌య్ షాకింగ్...

లైగ‌ర్ డిజాస్ట‌ర్ .. బాధ‌లో ఉన్న ఛార్మి కోసం విజ‌య్ షాకింగ్ నిర్ణ‌యం..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా `లైగ‌ర్`. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో పాటు బాలీవుడ్లో ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉండి ప్రమోట్ చేయడంతో.. నేషనల్ వైడ్ గా లైగర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దీనికి తోడు `ఇస్మార్ట్ శంకర్ ` లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పూరి దర్శకత్వం వహిస్తుండడంతో లైగర్ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే తొలిరోజే ఈ సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నిర్మాతలతో పాటు కొన్న బయ్యర్లు అందరూ భారీగా నష్టపోయారు. లైగ‌ర్ సినిమా కోసం జరిగిన ప్రమోషన్లు చూసి ఈ సినిమా రూ. 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కలెక్షన్లు సాధిస్తుందని అందరూ అంచనా వేశారు.

కట్ చేస్తే లైగర్ కు పెట్టిన పెట్టుబడిలో ఏకంగా 70 శాతానికి పైగా అందరూ నష్టపోయారు. ఈ సినిమా ప్లాప్ అవడంతో పూరి జగన్నాథ్ తన రెమ్యూనరేషన్ తో పాటు కలెక్షన్లలో తనకు వాటాగా వచ్చిన 70% డబ్బులను కూడా వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం హీరో విజయ్ ఏకంగా రూ. 35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మైక్ టైసన్ ను రంగంలోకి దింపారు. ఆయనకే ఏకంగా 35 కోట్లు ఇచ్చినట్టు టాక్.

ఇక ఈ సినిమా దెబ్బకు భారీగా నష్టపోయిన ఛార్మి తీవ్ర ఆవేదనలో కూరుకుపోవడంతో..విజయ్ ఆమెను ఓదార్చే క్రమంలో తన రెమ్యూనరేషన్ నుంచి 6 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చినట్టు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు భారీగా అప్పుల్లో కూరుకుపోయిన ఛార్మి ఆ సినిమాతో కాస్త కోలుకుంది. ఇప్పుడు లైగర్ దెబ్బతో మరోసారి ఛార్మి పూర్తిగా కుదేలు అయిపోయిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news