నందమూరి బాలకృష్ణ – వివి.వినాయక్ కాంబినేషన్లో 20 ఏళ్ల క్రిందట తెరకెక్కిన సినిమా చెన్నకేశవరెడ్డి. వివి వినాయక్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసుకునే బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో వీ సముద్ర దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్న బాలయ్య.. వెంటనే ఆ సినిమాను పక్కన పెట్టేసి వినాయక్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో చెన్నకేశవరెడ్డి సినిమా తెరకెక్కింది. ఆది సినిమాను నిర్మించిన బెల్లంకొండ సురేష్ ఈ సినిమాకు కూడా నిర్మాత. మణిశర్మ అను సంగీతం అందించగా… పరుచూరి ప్రదర్శన రైటర్స్ గా పనిచేశారు.
ఆది లాంటి సూపర్ హిట్ తర్వాత వినాయక్ డైరెక్టు చేసిన రెండో సినిమా చెన్నకేశవరెడ్డి కావడం… పైగా సినిమాలో రెడ్డి టైటిల్, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కటం.. బాలయ్య ద్విపాత్రాభినయం చేయడంతో సినిమాపై రిలీజ్‌కు ముందు ఆకాశాన్ని టచ్ చేసే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలయ్య కొడుకు పాత్రకు జోడిగా… శ్రీయ తండ్రి పాత్రకు జోడిగా సీనియర్ హీరోయిన్ టబు నటించారు. బాలయ్యకు సోదరిగా దేవయాని నటించింది. అయితే ఈ సోదరి పాత్రలో నటించమని వినాయక్ హీరోయిన్ లయను అడిగారట.
రామోజీ ఫిలిం సిటీలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వినాయక్ లయను కలిసి అసలు విషయం చెప్పారట. అయితే బాలయ్యకి జోడిగా కాకుండా చెల్లి పాత్రలో నటించమని తనను అడగడంతో లయ వెంటనే కన్నీళ్లు కార్చేసిందట. తెలుగు హీరోయిన్ అంటే ఎందుకు ? అంత చులకనగా చూస్తారు మేము హీరోయిన్లుగా పనికిరామా ? చెల్లెలు పాత్రలకే పరిమితం చేస్తారా అంటూ వెంటనే కన్నీళ్లు పెట్టుకుందట. అయితే వినాయక్ మరోలా అనుకోవద్దని లయకు సారీ చెప్పారట. ఆ తర్వాత ఈ పాత్రకు తమిళనటి దేవయానిని అడిగిన వెంటనే ఓకే చెప్పేసిందిట.
మరోవైపు టబు చేసిన పెద్ద బాలయ్య భార్య పాత్ర కోసం ముందుగా సౌందర్యను అడిగారట. అయితే తల్లి పాత్ర చేస్తే ఆ తర్వాత అన్నీ అలాంటి పాత్రలే వస్తాయని చెప్పి సౌందర్య ఆ పాత్రను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం టబును అడిగిన వెంటనే ఓకే చెప్పేసిందట. ఇక చెన్నకేశవరెడ్డి 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో భారీ ఎత్తున స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.