టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఈ యేడాది త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రెండు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టేశాడు. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా తెరకెక్కుతోంది. ఆ వెంటనే కేజీయఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే తన 31వ సినిమాలో నటిస్తున్నాడు. ముందుగా కొరటాల శివ సినిమాలో నటించే హీరోయిన్ కోసం గత ఆరేడు నెలలుగా పెద్ద అన్వేషణే కొనసాగుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా చాలా మంది పేర్లు వినిపించాయి. ఆచార్య తర్వాత కొరటాల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో ఎక్కడా రాజీపడడం లేదు. అయితే ఇప్పుడు ఫైనల్‌గా ఇద్దరు హీరోయిన్ల మధ్య చర్చ ఆగిందట. ఆ ఇద్దరు కూడా బాలీవుడ్ హీరోయిన్లే కావడం విశేషం. ఒకరు భరత్ అనే నేనులో వసుమతిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా అద్వానీ. ఆ సినిమా హిట్ అయ్యాక కియారా రామ్‌చరణ్ వినయ విధేయ రామ సినిమా చేసినా అది డిజాస్టర్ అయ్యింది.
అయితే కియారాకు తెలుగుతో పాటు నార్త్‌లో పిచ్చ క్రేజ్ ఉంది. పైగా ఆమె కొరటాలతో భరత్ సినిమా చేసి ఉంది. అందుకే ఆమెతో పాటు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ పేరు కూడా ఉంది. జాన్వీ కూఆ తెలుగులో సరైన హీరో పక్కన నటిస్తే ఇక్కడ స్ట్రాంగ్ పునాది పడుతుందన్న ఆశలతో ఉంది. బోనీ కూడా తన కుమార్తె టాలీవుడ్ ఎంట్రీకి సరైన కాంబినేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ హీరో, కొరటాల డైరెక్టర్ అంటే అంతకు మించిన మంచి కాంబినేషన్ ఎక్కడ ? దొరుకుతుంది.
గతంలో జాన్వీ మాట్లాడుతూ తన తల్లి చేసిన పాత్రలు చేసే సాహసం తాను చేయలేనని చెప్పుకువచ్చింది. తన తల్లి ప్రతిపాత్రతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుందని.. అలా చేయడం తనకు సాధ్యం కాదనే కుండబద్దలు కొట్టేసింది. కొరటాల అటు కియారాతో పాటు జాన్వీతో కూడా చర్చల్లోనే ఉన్నాడట. త్వరలోనే వీరిద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేసుకుని.. సినిమాను వచ్చే నెల నుంచి సెట్స్‌మీదకు తీసుకువెళ్లే ప్లానింగ్ అయితే నడుస్తోంది. మరి ఎన్టీఆర్ పక్కన ఈ ఇద్దరు ముద్దుగుమ్మల్లో ఎవరు ఛాన్స్ కొట్టేస్తారో ? చూడాలి.