ఏమన్నా అంటే అంటారు కానీ సోషల్ మీడియా వచ్చాక ట్రోరోలర్స్ మరింత రెచ్చిపోతున్నారు. తమ స్థాయిని మరిచి ఎదుటివారి స్థాయిని దిగజారుస్తూ బిగ్ బిగ్ స్టార్స్ ను కూడా నెట్టింట ఏకి పారేస్తున్నారు. దీంతో ఆ స్టార్ హీరో అభిమానులకు కోపం వస్తుంది. అఫ్ కోర్స్ ఏ హీరోని అభిమానించే ఫ్యాన్ అయినా సరే ఇలా చేస్తే కోపం వస్తుంది. పైగా ఒక అమ్మాయితో కంపేర్ చేసి ఒక అబ్బాయిని మాట్లాడుతుంటే మరింత కోపం వస్తుంది. అసలు ఏం జరిగిందంటే…
పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అర్జున్ రెడ్డి తో బీభత్సాన్ని సృష్టించాడు . సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేశాడు. తనదైన స్టైల్ లో నటిస్తూ ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి లాంటి వాళ్లే కావాలి అంటూ అభిమానులు కోరుకునేలా ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి పాత్రలో లీనమైపోయి నటించిన విజయ్ యాక్టింగ్ చూసి ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. కాగా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భారీ అంచనాల నడుమ వచ్చిన పాన్ ఇండియా ఫిలిం లైగర్ కూడా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశపడ్డారు.
కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ..సినిమా ఫ్లాప్ అయింది విజయ్ దేవరకొండ నటన కారణంగా కాదు ..పూరి జగన్నాథ్ డైరెక్షన్ కారణంగా . దీంతో విజయ్ దేవరకొండ తప్పులేదు అంటూ ఆయన అభిమానించే ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ అయిన కారణంగా హీరో విజయ్ తాను సినిమాకి తీసుకున్న 6 కోట్ల రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేశాడు అంటూ ఓ న్యూస్ హల్ చల్ చేసింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే అలా లైగర్ సినిమా ఫ్లాప్ అయిన కారణంగా విజయ్ దేవరకొండ ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వలేదు అంటూ పూరి సన్నిహితులతో మాట్లాడారు అంటూ మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా దీంతో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నా న్యూస్ ని ట్రోల్ చేస్తున్నారు ట్ర్ఫ్లర్స్. మనకు తెలిసిందే హీరోయిన్ సాయి పల్లవి ఏ సినిమా అయినా సరే ఫ్లాప్ అయితే తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేస్తుంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ని సాయి పల్లవి తో పోలుస్తూ కనీసం సాయి పల్లవి కున్న తెగింపు కూడా నీకు లేదా విజయ్ దేవరకొండ అంటూ కొందరు ఆయన్ని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మీమ్‌స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.