మనిషి జీవితంలో లైఫ్ స్టైల్ అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయించేది మన జీవన విధానం మాత్రమే అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్య సూత్రాలను అనుసరించకపోతే వయసు పైపడ్డాక కచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందే అని వైద్యులు, మానవ జీవన శాస్త్రవేత్తలు చెపుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న ఒత్తిడి జీవితంలో దానిని ఆచరించే వాళ్ళు చాలా అరుదు అని చెప్పాలి. ఓవైపు ఈ పోటీ ప్రపంచంలో మనిషి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సరైన ఆహార నియమాలు కూడా పాటించటం లేదు. ఇక చాలామంది దురలవాట్లకు లోనవుతున్నారు. ఇవన్నీ వయసు పైపడ్డాక వారిని రకరకాల సమస్యల్లోకి నెట్టివేస్తున్నాయి.
సెలబ్రిటీల్లో కరెక్ట్ గా ఆహార నియమాలు.. సూత్రాలు పాటించే వాళ్ళు తక్కువగా ఉంటారు. అయితే మన టాలీవుడ్ లో 60 సంవత్సరాల వయసు దాటినా ఎంతో క్రమశిక్షణతో ఉంటూ తన లుక్ మెయింటైన్ చేసే ఓ సీనియర్ హీరోకు ఎక్కడ తేడా వచ్చిందో గాని రీసెంట్‌గా మధుమేహం వ్యాధి వచ్చిందట. దీంతో సదరు హీరో విపరీతమైన టెన్షన్‌లోకి వెళ్లిపోయాడట. ఎవరికి అయినా మధుమేహం ( షుగర్ వ్యాధి) రానంత వరకే… వచ్చాక దానిని కంట్రోల్ చేయడం కష్టం.
ఇప్పటికీ ఆ సీనియర్ హీరో ఎంత ఏజ్ పెరిగినా కూడా చాలా పర్‌ఫెక్ట్‌గా తన ఫిజిక్, లుక్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇందులో అతడి భార్య హెల్ఫ్ కూడా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటాడు. అతడికి బరువు పెరగడం అన్న సమస్యే లేదు. అంత పర్‌ఫెక్ట్‌గా ఉంటాడు. అయితే గత కొద్ది రోజులుగా అతడి ఫేస్ పరిశీలిస్తే అతడు పాక్షికంగా బరువు తగ్గాడు. మధుమేహం ఎఫెక్ట్‌తో కఠిన ఆహార నియమాలు పాటించడం వల్లే అతడు ఇంతలా బరువు తగ్గాడని అంటున్నారు.
అయితే ఈ వయస్సులో కూడా ఆ సీనియర్ హీరో అందం, ఆకర్షణ ఏ మాత్రం తగ్గకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సన్నిహితులు సలహాలు ఇస్తున్నారట. ఆ హీరోకు ఉన్న మందు అలవాటు మర్చిపోయి మిగిలిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఇబ్బంది ఉండదని చెపుతున్నారట. దీని గురించి ఎక్కువ టెన్షన్ పడడం మానేయాలని.. లేకపోతే ఆ ప్రభావం సినిమాలతో పాటు ఆరోగ్యంపైనా పడుతుందని వైద్యులు కూడా సూచనలు చేశారట.