కొత్తగా వచ్చిన ఫ్రెష్ అండ్ యంగ్ బ్యూటీల కెరీర్ ఇప్పుడు త్వరగా ముగుస్తుందీ అంటే కొందరు సీనియర్ హీరోల వల్ల కొందరు దర్శక నిర్మాతల వల్ల అనే కామెంట్స్ నెటిజన్స్ నుంచి బాగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ లాంటి వారి సరసన ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తేనే ఫ్యాన్స్ కాకుండా మిగతా వారు బాగా కామెంట్స్ చేశారు. అయితే, వారి సినిమాలలో కుర్ర భామలను మరీ మీదపడేలా రొమాన్స్ చేసే సన్నివేశాలలో చూపించలేదు.
కానీ, ఇప్పుడు మరీ విపరీత ధోరణి అయిపోయింది. ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ పూర్తిగా మినహాయింపు అని చెప్పాలి. ఆయన మరీ చిన్న పిల్లగా కనిపించే హీరోయిన్స్ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకుందామంటే ఒప్పుకోరు. ఆయన వయసుకు తగ్గట్టుగానే హీరోయిన్‌ను ఎంచుకుంటారు. ఇటీవల కాలంలో పాతికేళ్ళ లోపు హీరోయిన్స్ 50 ఏళ్ళు పైబడిన హీరోతో రొమాన్స్ చేయాల్సి వస్తోంది. దీనికి ఉదాహరణ మాస్ మహారాజ రవితేజ, శ్రీలీల లను తీసుకోవచ్చు.
రవితేజ ఇప్పుడు ధమకా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. అసలు ఈ కాంబినేషన్ ఊహించుకోవడానికి చాలా అసహ్యంగా ఉందని ఇప్పటికే చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఇటీవల వచ్చిన టీజర్ చూసైతే ఇది పక్కా ఫెయిల్యూర్ కాంబినేషన్ అని మాట్లాడుకున్నారు. రవితేజ లాంటి ముసలి హీరో ఇంత చిన్నపిల్లతో రొమాంటిక్ సీన్స్ అంటే చి చీ అంటున్నారు. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి హీరోలతో సినిమాలు చేయడం..అవి ఫ్లాపవడం ఈ సినిమాలలో నటించిన పాపానికి కెరీర్ సంకనాకిపోవడం అలా జరిగిపోతున్నాయి.
ఇలా ఇప్పటికే చాలామంది కుర్రభామలు తమ కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరో హీరోయిన్స్ కాంబినేషన్ అనేది స్క్రీన్ మీద చూసేందుకు చాలా బావుండేది. కానీ, ఇప్పుడు కొన్ని సినిమాలలో ఇదే హీరో, హీరోయిన్స్ కాంబో చూస్తుంటే అసలు సినిమానే కాదు ఆ సినిమా ట్రైలర్ చూడాలంటే కూడా ఆసక్తి ఉండటం లేదు. ఒకరకంగా మంచి కెరీర్ ఉండే కుర్రభామలు క్రేజ్ కోసం వచ్చిన అవకాశాలు చేస్తే ఇంకేదో జరుగుతుందనే భ్రమలో పడి సర్వనాశనం చేసుకుంటున్నారు.