ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, సహజీవనం చేయడం… పెళ్లి చేసుకోవడం… విడిపోవడం చాలా మామూలు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సెలబ్రిటీలే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అన్ని పెళ్లిళ్లు చేసుకున్నా వీరు కలిసి ఉంటారన్న గ్యారెంటీ కూడా ఉండడం లేదు. ఇక సినిమా సెలబ్రిటీలు అయితే చాలా సింపుల్‌గా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని..ఆ వెంటనే విడిపోతున్నారు. మరి కొందరు అయితే ప్రేమలు, సహజీవనాలు, ఎంగేజ్‌మెంట్లు చేసుకుని.. పెళ్లి వరకు వెళతారు అనుకున్న సమయంలో విడిపోతున్నారు. టాలీవుడ్‌లో పెళ్లి వరకు వచ్చి విడిపోయిన జంటలు ఎవరెవరో చూద్దాం.
1- ఉదయ్ కిరణ్ – సుష్మిత :
టాలీవుడ్‌లో దివంగత హీరో ఉదయ్‌కిరణ్ మాంచి ఫామ్‌లో ఉన్నప్పుడు తన పెద్ద కుమార్తె సుస్మితను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. కుమార్తె స్వయంగా ఉదయ్‌ను ఇష్టపడడంతో చిరంజీవే స్వయంగా ఉదయ్ దగ్గర ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తర్వాత ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఈ బ్రేకప్ తర్వాత ఉదయ్ కెరీర్ పతనైపోయింది.
2- త్రిష – వరుణ్ :
చెన్నై అందం త్రిష, వ్యాపార వేత్త వరుణ్ మణియన్‌తో ప్రేమలో మునిగి తేలారు. అంతకు ముందే త్రిషకు శింబు, రానా, ధనుష్ లాంటి వాళ్లతో బ్రేకప్‌లు అయిపోయాయి. ఇక త్రిష – వరుణ్ ప్రేమించుకుని గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటన వద్దనే విషయంలో ఇద్దరికి గొడవలు రావడంతో వీరు విడిపోయారు. ఇప్పుడు వరుణ్ మరో హీరోయిన్ బింధు మాధవితో ప్రేమలో ఉన్నాడు.
3- నయనతార – ప్రభుదేవా:
నయనతారతో ప్రేమకు ముందే ప్రభుదేవాకి పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే నయనతార, ప్రభు పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు తన భార్య రమలత్‌కు విడాకులు కూడా ఇచ్చాడు. ప్రభు కోసమే నయన్ మతం మార్చుకునేందుకు కూడా రెడీ అయ్యింది. కారణం తెలియదు కాని వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చాలా సార్లు నయన్ తన మరో మాజీ ప్రియుడు శింబును అయినా క్షమిస్తాను కాని.. ప్రభుదేవాను మాత్రం ఎప్పటకీ క్షమించను అన్నట్టు టాక్ ?
4- శింబు – హన్సిక :
హన్సిక, రొమాంటిక్ హీరో శింబు ప్రేమించుకున్నారు. హన్సికను శింబు ప్రేమించడానికి ముందే నయనతారను ప్రేమించాడు.. ఆమెతో బ్రేకప్ అయిపోయింది. ఇక హన్సికను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని అనుకున్నాడు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయేవాడు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయి చివరకు ఒకరిని మరొకరు తిట్టుకునే వరకు వెళ్లిపోయారు.
5- అక్షయ్ కుమార్ – శిల్పాశెట్టి :
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. అంతకుముందే అక్షయ్‌కు మరో హీరోయిన్ రవీనా టాండన్‌తో బ్రేకప్ కూడా అయ్యింది. ఇక శిల్ప – అక్షయ్ బేధాభిప్రాయాలతో విడిపోయాక అక్షయ్ మరో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లాడాడు.
6- రష్మిక మందన్న – రక్షిత్ శెట్టి :
కన్నడంలో కెరీర్ స్టార్టింగ్‌లోనే రష్మిక, తనతో పాటు నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఆ వెంటనే ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో సూపర్ హిట్లతో పాటు స్టార్ డమ్ రావడంతో కెరీర్ ముఖ్యం అనుకుని..ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది.
7- రానా – త్రిష :
టాలీవుడ్‌లో దగ్గుబాటి వారసుడు రానా.. హీరోయిన్ త్రిష కూడా ప్రేమించుకున్నారు. త్రిష ప్రేమించిన వాళ్ల లిస్టులో రానా కూడా ఉన్నాడు. వీళ్లిద్దరు హైదరాబాద్‌లో పబ్బులు, క్లబ్బులో తిరుగుతూ చాలా మందికి కనిపించారు. ఆ టైంలో రానా త్రిషను పెళ్లి చేసుకుంటానని అడిగితే సురేష్‌బాబు గట్టిగా వద్దని చెప్పడంతోనే ఆగిపోయిందంటారు.
8- నయనతార – శింబు :
కెరీర్ స్టార్టింగ్‌లోనే నయనతార, శింబు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత వీరి మధ్య స్పర్థలతో వీరు బ్రేకప్ చెప్పేసుకుని ఎవరి దారుల్లో వారు ఉన్నారు.