టాలీవుడ్ లో సమ్మర్ లో వరుస పెట్టి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక దసరా కానుకగా అక్టోబర్ 5న పెద్ద, చిన్న అన్న తేడా లేకుండా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాయి. ఇందులో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ – నాగార్జున ది ఘోగోస్ట్ సినిమాలతో పాటు బెల్లంకొండ స్వాతిముత్యం – మా అధ్యక్షుడు మంచు విష్ణు జిన్నా సినిమాలు నువ్వా నేనా అని సవాళ్లు విసురుకునేందుకు రెడీగా ఉన్నాయి.
ఈ నలుగురిలో ఎవరైనా డ్రాప్ అవుతారా ? లేదా అన్నది ఇప్పటికే అయితే క్లారిటీ లేదు.. కానీ ప్రస్తుతానికి ఈ నలుగురు కూడా అదే డేట్ లాక్ చేసుకుని కూర్చున్నారు. ఇక అక్టోబర్ 5న నలుగు సినిమాలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతుండగా… 14వ తేదీ మాత్రం కాస్త చప్పగానే ఉంది. ఒకటి రెండు లో బడ్జెట్ సినిమాలు మాత్రమే ఆ రోజు లాక్ చేసుకున్నాయి. అయితే వచ్చే నెలలో దీపావళి సందర్భంగా 21వ తేదీన బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్ వార్‌కు రెడీ అవుతోంది.
యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఆరోజు రిలీజ్ అవుతుంది. వాస్తవంగా చూస్తే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో మంచి హిట్ కొట్టిన విశ్వక్సేన్ ఓరి దేవుడా సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ సినిమాలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు అన్న విషయం బయటకు వచ్చిన వెంటనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ఇక అదే రోజు మాస్ మహారాజ్ రవితేజ ధమాకా కూడా థియేటర్లోకి వస్తోంది. నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన అందచందాలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, స్టిల్స్ ఈ సినిమాపై భారీ ఇంచనాలు పెంచేసాయి. అలాగే జాతి రత్నాల దర్శకుడు అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కాంబినేషన్లో తెరకెక్కిన ప్రిన్స్ సినిమా సైతం అదే డేట్‌కు లాక్ అయినట్టు తెలుస్తోంది.
దీపావళి తమిళులకు కూడా ముఖ్యమైన పండుగ కావడంతో ఆ ఛాన్స్ వదులుకోవటం ఇష్టం లేక ఆ సినిమాని తెలుగు – తమిళ భాషల్లో ఒకేరోజు రిలీజ్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ లో కార్తీ నటిస్తున్న సర్దార్ సినిమా కూడా ఆ రోజుకే లాక్ చేసుకుని ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేశారు. ఇలా అక్టోబర్ 21వ తేదీన 4 భారీ అంచనాలతో వస్తున్న సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మామూలుగా ఉండేలా లేదు.