హీరోయిన్ అంటే ఇప్పుడు లెక్కలు చాలా మారిపోయాయి. ఇప్పుడే కాదు, దాదాపు 15 – 20 ఏళ్ళ నుంచే అన్నీ సినిమా ఇండస్ట్రీలలో పద్ధతులన్నీ మారుతూ వస్తున్నాయి. హీరో, హీరోయిన్స్ మధ్య సందర్భానుసారంగా ముద్దు సన్నివేశాలుంటే వాటిని ఒప్పించడానికి దర్శక నిర్మాతలు చాలా ఆలోచించేవారు. అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ అలా ఉండేది. కాస్త అసభ్యకరమైన సన్నివేశాలుంటే ఆ సినిమాను ఓ బూతు సినిమాగా చూసేవారు.
కానీ, రానురాను సినిమాలలో మసాలా సన్నివేశాలు ఎక్కవవుతూ వస్తున్నాయి. ఏ సినిమా కథ అయినా మాయాబజార్ లాంటి మూవీ నుంచి పుట్టాల్సిందే. కానీ, జనరేషన్స్ మారుతూ వస్తున్నా కొద్దీ హీరోయిన్స్ గ్లామర్ రేంజ్ పెరుగుతూ వస్తోంది. అందాల ఆరబోత అనేది సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది అనే కొత్త లెక్కలు వచ్చాయి. అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మీ లాంటి వారే స్పెషల్ సాంగ్స్‌లో అందాలను ఆరబోసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్సే ఆ రేంజ్లో అందాల ప్రదర్శనను ఇచ్చేందుకు రెడీగా ఉంటున్నారు.
ఇప్పుడు ఒక హీరోయిన్ను సినిమాకు మాట్లాడాలంటే ఇలా అయితే ఇంత రెమ్యునరేషన్.. ఇలాంటి సన్నివేశాలు చేయాలంటే ఇంత రెమ్యునరేషన్.. ముద్దు సీన్స్ చేయాలంటే ఇంత..అని డిమాండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి ఒప్పుకుంటున్నారు. మూడు రోజులు ఓ ఐటెం సాంగ్ చేస్తే కోటి రూపాయలను అందుకుంటున్నారు. ఇక పెదవి ముద్దు సన్నివేశాలలో అది కూడా మరీ నోట్లో నోరుపెట్టు ముద్దు పెట్టుకోవాలంటే ఎక్కువగా లాగుతున్నారు.
కొందరు హీరోయిన్స్ అయితే, కథ కంటే కూడా సినిమాలో ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి..ఎన్ని ముద్దులు పెట్టాలి అని ముందే అడుగుతున్నారు. అలాంటి వాటిలో నటించాలంటే అదనంగా డబ్బులివ్వాలి. దర్శక నిర్మాతలు కూడా కమర్షియల్ హిట్ అవ్వాలంటే కథ ఎలాంటిసైనా రొమాంటిక్ సీన్స్, కిస్సులు ఉండేలా కథలు సిద్ధం చేస్తున్నారు.
కొంతమంది గ్లామర్ బ్యూటీస్ అయితే, సినిమాలో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్, ముద్దులు ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. ముసలి హీరోలు కూడా పాతికేళ్ళ కుర్ర భామలను నలిపేసే సన్నివేశాలలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ముద్దు సీన్స్ ఉంటే మళ్ళీ ఛాన్స్ రాదని రెచ్చిపోతున్నారు. అయితే, ఇలాంటి సినిమాలను జనాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.