Moviesదారుణమైన దీన స్థితిలో ఈ సీనియర్ నటి.. ఈమె పరిస్ధితి చూస్తే...

దారుణమైన దీన స్థితిలో ఈ సీనియర్ నటి.. ఈమె పరిస్ధితి చూస్తే కన్నీళ్లు ఆగవు..!!

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం ..ఇది ఓ రంగుల ప్రపంచం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. అప్పటివరకు పరిస్థితి అంతా మన చేతుల్లోనే ఉంది అన్నట్లు బ్రమ కలుగుతుంది. కానీ అవి ఏవి నిజం కాదు. ఒక్కసారిగా మన హీరోయిన్ స్టేటస్ తగ్గిపోయిన ..సినీ ఇండస్ట్రీలో ఫ్లాపులు పడ్డా.. ఆ హీరోని కానీ, హీరోయిన్ ని కానీ ..అస్సలు పట్టించుకోరు జనాలు. తద్వారా సినిమా అవకాశాలు లేక హీరోయిన్లు రోడ్డుపై పడతారు .ప్రజెంట్ అదే పొజిషన్లో ఉంది ఈ ఒకప్పటి సీనియర్ నటి జయకుమారి.


ఈ పేరు చెప్తే ఈ జనరేషన్ కి అర్థం కాకపోవచ్చు కానీ ఇంట్లో ఉన్న అమ్మ, నాన్నకి ,,అమ్మమ్మలకి-తాతలకి ఈ పేరు బాగా తెలుసు . ఒకప్పుడు తనదైన స్టైల్ లో నటించి , అలరించి, మెప్పించిన నటి జయకుమారి ..ప్రస్తుతం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. దానికి కారణం ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడమే. అంతేకాదు ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయి . పూర్తిగా దెబ్బతిన్నాయి . ఆర్థిక స్తోమత లేక చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే ధైర్యం చేయలేక ప్రభుత్వాసుపత్రిలో చేరి సహాయం కోసం వేచి చూస్తున్నారు.


ఈ సీనియర్ నటి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో 450కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. ఈమెకి ఓ కుమారుడు ఇద్దరు కుమార్తెలు . ప్రజెంట్ ఈమెను చూసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఒకప్పుడు బంగ్లాలో బ్రతికిన ఈమె ఇప్పుడు అద్దె ఇంట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా కాలం క్రితమే ఆమె భర్త నాగపటినం అబ్దుల్లా అనారోగ్య కారణంగా మరణించినట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఈమె ఒంటరిగానే జీవిస్తుంది. నా అన్న వాళ్ళు దగ్గర తీయ్యక ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో చూపించుకునే స్తోమత లేక అల్లాడిపోతుంది. ఎవరైనా సహాయం చేస్తారా.. అంటూ ఎదురుచూస్తుంది. ఒకప్పుడు బిగ్ సినిమాల్లో నటించిన ఈ నటికీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడడం.. చాలా బాధాకరం అంటున్నారు సినీ ప్రముఖులు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. అనేదానికి బెస్ట్ ఉదాహరణ ఇదే అంటూ చెబుతున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news