సినిమా హీరోల అందానికి సాధారణ అమ్మాయిలు పడిపోవడమే కాదు స్టార్ హీరోయిన్ సైతం పడిపోవడం చాలా కామన్. అంతే కాకుండా హీరోల అందంతో పాటూ వారి మనసును కూడా తెలుసుకునే ఛాన్స్ హీరోయిన్ లకు ఉంటుంది. ఇక సినిమా షూటింగ్ సమయంలో తాము కలిసి నటిస్తున్న హీరో మంచివాడైతే అతడిపై మనసుపారేసుకుంటే వారితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటారు. అలా చిత్ర సీమలో షూటింగ్ హీరోలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు వారినే పెళ్లి చేసుకున్న హీరోయిన్ లు చాలా మంది ఉన్నారు. అలా తమ హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం…
మహేష్‌బాబు – నమ్రత :
సూపర్ స్టార్ మహేశ్ బాబు నమ్రత కలిసి వంశీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా 2000 సంవత్సరంలో తెరకెక్కింది. ఈ సినిమా సమయంలోనే నమ్రత మహేశ్ తో లవ్ లో పడింది. ఇక వీరిద్దరూ ఆ తరవాత ఒకరి గురించి మరొకరు తెలుసుకుని 2005లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
నాగార్జున – అమల :
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హీరోయిన్ అమల కూడా సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి శివ సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
చైతు – సమంత :
ఏం మాయచేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత ఆ సినిమా షూటింగ్ సమయంలోనే చైతూ మాయలో పడేసింది. కానీ చాలా కాలం తరవాత చైతూను కూడా తన మాయలో పడేసుకుంది. ఇక వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోగా కలహాలు రావడంతో గతేడాది విడాకులు తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ :
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో రేణూదేశాయ్ కూడా సినిమా షూటింగ్ లోనే లవ్ లో పడ్డారు. వీరిద్దరూ కలిసి బద్రి, జానీ సినిమాలలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడటంతో ఆ తరవాత డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
సూర్య – జ్యోతిక :
తమిళస్టార్ హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ మొదటిసారి 1999 లో పూవెల్లం కెట్టుప్పర్ సినిమా షూటింగ్ లో కలుసుకున్నారు. అప్పుడే ప్రేమలో పడగా 2006లో వివాహం చేసుకుని సౌత్ లో లవ్లీ కపుల్ గా మారారు.