సితార దర్శకుడిగా వంశీకి రెండో సినిమా… అలాగే హీరోయిన్గా ఇది భానుప్రియకు మొదటి సినిమా. భానుప్రియను తెలుగు తెరకు పరిచయం చేసి.. మంచి నటిగా తీర్చిదిద్దిన ఘనత నిజంగానే వంశీకే దక్కుతుంది. సుమన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్. తాను సొంతంగా రాసుకున్న మహాల్లో కోకిల నవల బేస్ చేసుకుని వంశీ సితారను తెరకెక్కించారు.
పంజరంలో చిలుకలా ఉన్న జమీందారు కుటుంబంలో ఉన్న ఓ యువతి స్వచ్ఛమైన ప్రేమ ఎలా పొందింది ? అన్న కాన్సెఫ్ట్‌తో సితార తెరకెక్కింది. సినిమాలో పాటలు అన్ని సూపర్ హిట్. ఇళయరాజాతో వంశీ పని చేసిన తొలి సినిమా ఇదే. ఈ సినిమా హిట్ అయ్యాక.. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. 1984లో రిలీజ్ అయిన సితార ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు గెలుచుకుంది.
ఆ తర్వాత సితారను తన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో హీరోయిన్గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే వంశీ ఆమెను ఇష్టపడగా… వంశీని కూడా భానుప్రియ ఇష్టపడింది. అయితే అప్పటికే వంశీకి పెళ్లయ్యి పిల్లలు ఉండడంతో భానుప్రియ తల్లికి వీరి ప్రేమ వ్యవహారం నచ్చలేదు. అలా వంశీకి తన కుమార్తెను భానుప్రియ తల్లి దూరం జరిగేలా చేసింది.
వారిద్దరి ప్రేమ అప్పట్లో హాట్ టాపిక్. ఇదే విషయాన్ని సీనియర్ దర్శకుడు సాగర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భానుప్రియను వంశీ ఇష్టపడింది నిజమే అని.. అలాగే ఆమె కూడా తన కెరీర్‌ను తీర్చిదిద్దడంతో వంశీకి కమిట్ అయ్యిందని చెప్పారు. ఆ తర్వాత భానుప్రియ ఓ ఎన్నారైను పెళ్లాడి అమెరికాలో సెటిల్ అయ్యింది. తర్వాత మనస్పర్థల నేపథ్యంలో భర్తకు దూరమవ్వగా… అతడు కూడా కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు.