బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రేమాయణం గురించి గత నాలుగు సంవత్సరాలుగా రోజుకో వార్త వినిపిస్తోంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలడంతో పాటు సహజీవనం కూడా చేస్తున్నారు. పెళ్లయి 20 ఏళ్ల పాటు భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్నాక కూడా మలైకా అర్జున్ కోసం భర్తకు విడాకులు ఇచ్చేసింది. పైగా తనకంటే వయసులో 10 ఏళ్లకు పైగా చిన్నోడు అయినా అర్జున్తో సహజీవనం చేయడంతో పాటు చెట్టపట్టలేసుకొని తిరుగుతూ ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటోంది.
తమ ప్రేమాయణం గురించి ఎవరు ఎన్ని విమర్శలు చేసిన మలైకా – అర్జున్ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. పైగా అమ్మమ్మ వయసులో ఉన్న మలైకా ఇప్పటికీ హాట్ హాట్ బికినీలతో కుర్ర హీరోయిన్లకు తాను ఏమాత్రం తీసిపోను అనేలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అర్జున్ కపూర్ తో ప్రేమలో పడటం వల్లే ఎంతో గొప్పగా చూసుకునే తన భర్త అర్బాజ్ ఖాన్కు సైతం మలైకా విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం అర్జున్ కపూర్ కి చెందిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
విచిత్రం ఏంటంటే ఆ ఫోటో మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ పెళ్లిలో అర్జున్ దిగిన ఫోటో. అప్పుడు అర్జున్ చాలా చిన్నోడు. అర్జున్ పెళ్లిలో కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నాడు. అయితే ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చిన్నప్పుడు మలైకా పెళ్లికి వెళ్లి పెళ్లిని బాగా ఎంజాయ్ చేసిన అర్జున్ ఇప్పుడు ఆమెతోనే డేటింగ్ చేయటం చాలా విడ్డూరంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
మలైకా, అర్బాజ్ ఖాన్ పెళ్లి జరిగినప్పుడు అర్జున్ కపూర్ టీనేజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మలైకా పెళ్ళికి వెళ్ళిన అర్జున్ అప్పుడు అనుకున్నాడో లేదో గాని ఇప్పుడు ఏకంగా ఆమెనే తన ప్రేమలో పడేసి తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. కాలం ఎంత మార్పు తెస్తుంది అనేందుకు ఈ సంఘటన మంచి ఉదాహరణ అని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. మలైకా – అర్జున్ పీకలోతు ప్రేమలో ఉన్నా ఇప్పటివరకు పెళ్లి అయితే చేసుకోలేదు. మరి వీరు ఎప్పటికీ ప్రేమ పక్షుల్లా ఉండిపోతారా ? పెళ్లి చేసుకుని ఒకటవుతారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.