సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ లు , అఫైర్లు కామన్. ఈ మధ్యకాలంలో విడాకులు కూడా కామన్ అయిపోయాయి. ఎన్ని రోజులు ప్రేమించుకున్నామా.. ఎన్ని రోజులు కాపురం చేసామా ..అన్నది కాదు.. ఎంత త్వరగా విడిపోయామా అన్నది పాయింట్. అదే ఆలోచిస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అయితే దారుణంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు హీరోస్, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు.
తమ వయసును మరిచిపోయి సమాజం లో కట్టుబాట్లను తెగించి.. బరితెగించి.. మరొకరితో సంబంధం పెట్టుకోవడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు. కొందరు సుందరిమణులు. మనకు తెలిసిందే రీసెంట్ గా పవిత్ర లోకేష్ -నరేష్ మ్యాటర్ సినీ ఇండస్ట్రీలో ఎన్ని ప్రకంపనులు సృష్టించిందో. కాగా సేమ్ అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టార్ ప్రొడ్యూసర్ తో సహజీవనం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది .
అంతేకాదు ఈ జంట కూడా త్వరలోనే అఫీషియల్ గా తమ డేటింగ్ మ్యాటర్ ని మీడియాకు చెప్పాలని భావిస్తున్నారట. అయితే ఈ డేటింగ్ జంట మాత్రం పెళ్లిగా చేసుకోరట. తిరిగిన అన్ని రోజులు బాగా తిరిగి.. ఎంజాయ్ చేసిన వరకు చేసి ..ఆ తర్వాత వాళ్లకు నచ్చిన్నట్లు చేస్తారట. ఏంటో మరి దీనికి డేటింగ్ అనే పేరు కరెక్ట్ అవుతుందా..? ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఇలాంటి పవిత్ర లోకేష్‌లు ఎక్కువ అయిపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.