Moviesఆ ఫ్యామిలీ ఫంక్ష‌న్లో తార‌క‌ర‌త్న ఎన్టీఆర్‌ను అవ‌మానించాడా... ఏం జ‌రిగింది...!

ఆ ఫ్యామిలీ ఫంక్ష‌న్లో తార‌క‌ర‌త్న ఎన్టీఆర్‌ను అవ‌మానించాడా… ఏం జ‌రిగింది…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సూటిపోటి మాటలు తప్పలేదు. కెరీర్ ప్రారంభంలో సొంత కుటుంబం నుంచి సరైన మద్దతు లేదు. ఎప్పుడు అయితే `స్టూడెంట్ నెంబర్ 1`, `ఆది`, `సింహాద్రి` సినిమాలు వచ్చాయో అప్పటినుంచి నందమూరి తెలుగుదేశం అభిమానులు కూడా తారక్ ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు.
`యమదొంగ` తర్వాత కెరీర్ పరంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సరైన హిట్ లేదు.

మళ్లీ `టెంపర్` సినిమా నుంచి ఆరు వరసహిట్లతో.. ఈరోజు టాలీవుడ్ లోనే తిరుగులేని నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. అటు `త్రిబుల్ ఆర్` సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో హిట్టు కొట్టాక నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కుర్ర హీరోను ఎన్టీఆర్‌కు పోటీగా తీసుకురావాలన్న ప్రయత్నాలు జరిగాయి.

ఆ ప్రయత్నాల్లో భాగంగానే నందమూరి తారకరత్నను హీరోగా చేశారు. అప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు తారకరత్న హీరోగా ఒకేసారి ఏకంగా తొమిది సినిమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఒక టాలీవుడ్ హీరోను పరిచయం చేసే క్రమంలో ఏకంగా తొమ్మిది సినిమాలు ఒకేరోజు ప్రారంభం కావటం తెలుగు సినిమా చరిత్రలోనే ఓ రికార్డుగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ పోటీగానే తారకరత్నను రంగంలోకి దింపారు.. అన్నది వాస్తవం. అయితే తారకరత్న కనీసం మిడిల్ రేంజ్ హీరోగా కూడా సక్సెస్ కాలేకపోయాడు. అది వేరే విషయం.

ఇక నందమూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్‌కు గొడవలు ఉన్నాయన్న విషయం ఎప్పటికప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఒకసారి నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్ కు ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ ద్వారా వెళ్లారట. ఆ ఫంక్షన్ లో తార‌కరత్న ఎన్టీఆర్‌ను కావాల‌నే అవమానించారు అన్న ప్రచారం అప్పట్లో వినిపించింది. ఈ ప్రచారంపై తారకరత్న తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ను అవమానించాల్సిన అవసరం తనకు లేదని.. అది కేవలం పుకారు మాత్రమే అని… కొందరు పనికట్టుకుని ఈ పుకార్లను ప్రచారం చేస్తూ ఉంటారని తారకరత్న క్లారిటీ ఇచ్చాడు. ఇక హీరోగా సక్సెస్ కానీ తారకరత్న `అమరావతి` సినిమాతో విలన్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news