లెక్కల మాస్టారు సుకుమార్ తన సినిమాలలో హీరోలకు ఎంత బలమైన పాత్రలను రాస్తారో హీరోయిన్స్‌కి అంతే బలమైన పాత్రలను రాస్తారు. కొరటాల శివ లాంటి దర్శకులే సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నా జనతా గ్యారేజ్‌లో బలమైన పాత్రను రాయలేకపోయారు. పైగా ఈ మాట అడిగితే, అసలు సమంత ఎక్కడుందీ..కథ మొత్తం ఎన్.టి.ఆర్‌ది అయితే..అని సమాధానం చెప్పారు. కానీ, పూరి జగన్నాథ్.. సుకుమార్ లాంటి సినిమాలు హీరోయిన్స్‌కి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.
అయితే, సుకుమార్ సినిమాలలో నటించిన కొందరు హీరోయిన్స్ ఎందుకు నటించామా..? అని ఇప్పటికీ బాధపడుతున్నారట..? దానికి కారణం ఆయన సినిమాతో వస్తుందనుకున్న పాపులారిటీ రాకపోవడమే. ఆర్య సినిమా ద్వారా అను మెహతా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఒకటి రెండు సినిమాల తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. ఆర్య లాంటి బ్లాస్టర్ ఆ హీరోయిన్ కెరీర్‌కి ఉపయోగపడలేదు.
ఇలాంటి మరో హీరోయిన్ కృతి సనన్. సుకుమార్ కెరీర్‌లో తీసిన సినిమాలు తక్కువే. అయినా బ్లాక్ బస్టర్ – భారీ డిజాస్టర్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కృతి కెరీర్ ఇక్కడ ముగిసింది. తర్వాత కృతి తెలుగులో నాగచైతన్యకు జోడీగా దోచేయ్ చేసినా అది కూడా డిజాస్టర్ అయ్యింది.
వీరిద్దరే కాదు, సుక్కూ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా జగడం. రామ్ పోతినేని, ఈషా జంటగా నటించారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. వాస్తవంగా ఈ సినిమా కథ సుకుమార్ ఎంతో ఇష్టపడి రాశాడు..తీశాడు. కానీ, ఊహించనివిధంగా ఫ్లాప్‌ని మూటగట్టుకుంది. సుక్కు పరిచయం చేసిన ఈ హీరోయిన్ అయితే ఒకే ఒక్క సినిమాతో సర్దుకుంది. సుకుమార్ ఎందుకో హీరోయిన్స్‌గా ఈ ముగ్గురిని నిలబెట్టలేకపోయాడు. ఇక స్టార్ హీరోయిన్స్‌గా ఉన్న రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, సమంత, రష్మికలకి మాత్రం భారీ హిట్స్ ఇచ్చాడు.