శ్రీహరి ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. తనదైన స్టైల్ లో ఏ పాత్ర అయినా సరే నటించి మెప్పించగలిగిన ఈయన .. ప్రజెంట్ మన మధ్యలో లేడు. నిజం చెప్పాలంటే శ్రీహరి లాంటి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ని కోల్పోవడం టాలీవుడ్ చేసుకున్న బిగ్గెస్ట్ పాపం. శ్రీహరి లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. డబ్బు ఆశ లేకుండా నటనపై ఇంట్రెస్ట్ తో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా పాత్రకు ప్రాధాన్యం ఇచ్చి నటించే వాళ్ళు చాలా అరుదు. అలాంటి వారిలో ఒకరే ఈ శ్రీహరి .
అలాంటి నటుడు ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. మనకు తెలిసిందే శ్రీహరి తనదైన స్టైల్ లో అన్ని పాత్రలు చేసి మెప్పించారు. రీల్ లైఫ్ లో ఎంత సీరియస్ గా ఉంటారో.. రియల్ లైఫ్ లో అంత సరదాగా ఉంటారు. ఆయన ఐటమ్ గర్ల్ గా సినిమాలో పాటలు చేసిన డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పెళ్లి చేసుకునే టైంలో చాలామంది ఆయనను నీ భార్య ఓ ఐటమ్ గర్ల్ అంటూ వెక్కిరించారట. ఆ లిస్ట్ లోకి సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో కూడా వస్తారట. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా సర్వసాధారణం.. అలా చాలా మందిని టీస్ చేస్తూ ఉంటారు. అయితే శ్రీహరి మాత్రం ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తన భార్యను తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నారట.
శ్రీహరికే కాదు డిస్కో శాంతి కి కూడా శ్రీహరి అంటే ప్రాణం. పెళ్లి తర్వాత తన భర్త పరువు ప్రతిష్టలను కాపాడుతూ భర్త అడుగుజాడల్లోనే నడుచుకుంటూ శ్రీహరికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో డిస్కో శాంతి అంటే శ్రీహరి భార్య గానే గుర్తిస్తారు. ఎవరో చాలా రేర్ గా ఆమెని ఐటెం గర్ల్ అంటూ ఇప్పటికీ పిలుస్తున్నారు. అయితే భర్త మరణం తర్వాత శ్రీహరి భార్య డిస్కో శాంతి ..సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది . బిడ్డలను చూసుకుంటూ తన ప్రాణాలను వాళ్లపైనే పెట్టుకొని బ్రతుకుతుంది.