Moviesస్టార్ హీరో తమ్ముడు అందుకు పనికిరాడా..? సొంత ఫ్యాన్సే ఆడేసుకుంటున్నారుగా..!!

స్టార్ హీరో తమ్ముడు అందుకు పనికిరాడా..? సొంత ఫ్యాన్సే ఆడేసుకుంటున్నారుగా..!!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా కాదు కాదు గత కొన్ని నెలలుగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కనిపించట్లేదు. ఇదే న్యూస్ మనం చాలా సార్లు విన్నాం. కానీ రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం తండ్రితో వచ్చిన విభేదాల కారణంగా ముంబైకి వెళ్లిపోయాడట . ఇదే ప్రజెంట్ సినీ వర్గాలలో చర్చనీయాంసంగా మారింది. మనకు తెలిసిందే అల్లు శిరీష్ తండ్రి పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీకి వచ్చి పలు సినిమాలు చేశాడు.

కొద్దో గొప్పో మెప్పించి ఓ మోస్తరు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే సినీ ఇండస్ట్రీలో ఆ మాత్రం టాలెంట్ ఉంటే సరిపోదు లక్ ఉండాలి. అది మన శిరీష్ కి లేన్నట్లుంది అందుకే అన్న స్టార్ హీరో అయిన నాన్న బిగ్ ప్రొడ్యూసర్ అయిన నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో చాలామంది అప్పట్లో అల్లు శిరీష్ నటనకు పనికి రాడు అంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు స్టార్ హీరో తమ్ముడు స్టేటస్ ఉండి అంత మంచి టాలెంట్ ఉన్న హీరోని ఇంట్లో పెట్టుకొని ఎందుకు నువ్వు హీరోగా మారలేకపోయావ్ అంటూ సూటిగా ప్రశ్నించారు కొందరు నెటిజన్స్… అయినా దానికి ఆన్సర్ ఇవ్వలేదు.

తాజా సమాచారం ప్రకారం తన కుటుంబానికి దూరంగా ముంబైలో ఉంటున్నాడట శిరీష్. దానికి కారణం తనకు అల్లు అరవింద్ కు స్టైలిష్ స్టార్ బన్నీకి వచ్చిన గొడవలే కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. నిజానికి అల్లు శిరీష్ తెరపై కనిపించి చాలా ఏళ్లు గడుస్తుంది . అప్పుడెప్పుడో సినిమా ప్రకటించాడు అసలు ఆ సినిమా ఉందో లేదో ఏమైందో కూడా చెప్పలేదు దీంతో సొంత ఫాన్సే అల్లు శిరీషను ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి . దీంతో ఇప్పుడు అందరికీ ఒక బిగ్గెస్ట్ డౌట్ ఏర్పడింది. నిజంగానే అల్లు శిరీష్ ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయాడా..? వెళ్ళిపోతే కారణమేంటి..? అసలు ఇక తిరిగి రాడా..? అంటూ ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news