అవునండి.. ఇప్పుడు అందరూ ఇదే మాట అంటున్నారు . కేవలం ఒకరిద్దరు డైరెక్టర్స్ కాదు.. దాదాపు పది పన్నెండు మంది డైరెక్టర్స్..ఇదే పలుకులు పలుకుతున్నారు. వామ్మో ఆ హీరోయిన్ తో సినిమానా కష్టం లేరా బాబు అంటూ చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మడు నో ఎక్స్పోజింగ్ ..నో రొమాన్స్ ..నో లిప్ కిస్ ..నో వైలెన్స్ అంటుంది. దీంతో ఇవి లేకుండా సినిమా చూసే జనాలు ఉన్నారా? ఈ రోజుల్లో అయితే లేరు అందుకే సినిమాలు తీసి నెత్తిన గుడ్డవేసుకోవడం ఎందుకు రా బాబు అంటూ తప్పుకునేస్తున్నారు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
మరెవరు సాయి పల్లవి ఈ మలయాళ బ్యూటీ నే.. ఆఫ్ కోర్స్ సాయి పల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ , క్రేజ్ ఎక్కువ , జనాల్లో విపరీతమైన ప్రేమ ఉంది . కానీ ఆ సినిమా తీస్తే హిట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం తక్కువ . ఎందుకంటే సాయి పల్లవి ముద్దు సీన్లు చేయరు. రొమాంటిక్ సీన్స్ సీన్స్ చేయదు. మనసును బాధ పెట్టే సీన్స్ చేయరు . మరి ఇలాంటి సీన్స్ లేకుండా ఓ సినిమాను తెరకెక్కించడం అంటే కొంచెం కష్టమే.. అలా కష్టమైన సినిమాలను చేసింది. ఆ రిజల్ట్ చూసి పాపం అమ్మడు కష్టపడింది. అందుకే కాబోలు..” ఇక నేను సినిమాలు చేయను అంటూ నిర్మాతలను బాధ పెట్టను అంటూ తన డాక్టర్ వృత్తిని కంటిన్యూ చేయడానికి సిద్ధపడుతుంది సాయి పల్లవి”.
సాయి పల్లవి చేసిన సినిమాలు చాలా తక్కువ వాటిలో హిట్ కొట్టినవి మరీ తక్కువ . ఈ మధ్యకాలంలో సాయి పల్లవి చేసిన గార్గి, విరాటపర్వం అని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అంతేకాదు మేకర్స్ కి భారీ నష్టాలు మిగిల్చాయి. దీంతో జాలీ దయ కలిగిన సాయి పల్లవి ఇకపై సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యిందట. తన మనసుకు నచ్చిన కథ చేయడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారని ..అలా నా ఆనందం కోసం నా మూర్ఖత్వంతో ఒకరిని బలి చేయనని చెప్పుకొచ్చిందట. అయితే డైరెక్టర్స్ కూడా సాయి పల్లవి అయితే సినిమా చేయడానికి రెడీగా లేరు అంటున్నారు . మరి చూడాలి సాయి పల్లవి సినీ కెరీర్ ఎలా ఉండబోతుందో..??