ఏ రంగంలో అయినా పోటీదారుల మధ్య ఆధిపత్య యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఇక సినిమా రంగంలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య, స్టార్ డైరెక్టర్ల మధ్య స్టార్ హీరోయిన్ల మధ్య స్టార్ టెక్నీషియన్ల మధ్య కూడా అలాంటి పోటీ వాతావరణమే ఉంటుంది. అయితే ఈ పోటీ వాతావరణం స్నేహపూర్వకంగా ఉండాలి.. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలన్న ఆధిపత్యంతో ఈ పోటీ ఉంటే అది అనేక మనస్పర్ధలకు దారితీస్తుంది. తెలుగు సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల మధ్య యుద్ధం చాలా సంవత్సరాల నుంచి ఆ ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది.
1970 – 80వ దశంలో స్టార్ హీరోయిన్లుగా ఉన్న శ్రీదేవి, జయప్రద మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదట.
శ్రీదేవి – జయప్రద ఇద్దరు మధ్య అసలు మాటలు కూడా ఉండేవి కాదని చాలామంది చెప్తూ ఉంటారు. అప్పటికే జయప్రద స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఒక్కసారిగా దూసుకు వచ్చిన శ్రీదేవి జయప్రద మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అలా టాప్ ర్యాంకు కోసం వీరిద్దరి మధ్య జరిగిన పోరులో చివరకు ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి వచ్చేసింది.
చివరికి ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించిన కూడా అస్సలు మాట్లాడుకునే వారు కాదట. జయప్రదకు శ్రీదేవితో మాత్రమే కాదు కృష్ణ భార్య విజయనిర్మలతోనూ గ్యాప్ ఉండేదని చెబుతూ ఉంటారు. కృష్ణ – జయప్రద కాంబినేషన్లో ఏకంగా 43 సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కృష్ణ – జయప్రద కాంబినేషన్ అంటే ఒక క్రేజీ కాంబినేషన్ గా అప్పట్లో పేరు ఉండేది. కృష్ణ – జయప్రద కాంబినేషన్ కు మంచి పేరు ఉండడంతో విజయనిర్మలకు అంతగా ఇష్టం ఉండేది కాదని… అలా విజయనిర్మల – జయప్రద మధ్య కూడా గ్యాప్ ఉందని చెబుతూ ఉంటారు.
కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన దేవత సినిమాలో శ్రీదేవి – జయప్రద ఇద్దరు నటించారు.
ఆ సినిమాకు ముందు నుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవట. అయితే ఈ గ్యాప్ తెలుసుకున్న రాఘవేంద్రుడు ఒకరోజు షూటింగ్ కు జయప్రదను రెండు గంటలు ముందుగా ( ఉదయం 9 గంటలకే) రమ్మని చెప్పేవారట. ఆ రెండు గంటల పాటు జయప్రద సీన్లు షూట్ చేశాక…. 11 గంటల నుంచి శ్రీదేవి సీన్లు షూట్ చేసేవారట ఆ మరుసటి రోజు రెండు గంటల ముందుగా శ్రీదేవిని స్పాట్ కు రమ్మని… రెండు గంటలు ఆలస్యంగా జయప్రదం రమ్మని చెప్పేవారట.
ఇక ఇద్దరు కలిసి నటించే సీన్లు ఉంటే ఆయన జోకులు వేస్తూ వాళ్లను ఆటపట్టిస్తూ సీన్లు తీసేవారట.
ఒక్కో సందర్భంలో వాళ్లిద్దరు నవ్వుతుండగానే ఆయన ఇద్దరి చేతులు కలిపేందుకు ట్రై చేసేవారట. ఇలా వాళ్ల మధ్య గ్యాప్ ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగానే తాను మ్యానేజ్ చేస్తూ సీన్లు తీసేవాడిని అని ఆయన చెప్పారు. దీనిని బట్టే జయప్రద, శ్రీదేవి మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుస్తోంది.