Moviesఐ ల‌వ్ యూ చిరంజీవి.. త‌ట్టుకోలేక పోతున్నా అంటోన్న శ్రీముఖి (...

ఐ ల‌వ్ యూ చిరంజీవి.. త‌ట్టుకోలేక పోతున్నా అంటోన్న శ్రీముఖి ( వీడియో)

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళం లో హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెరికెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించిన ఈ సినిమాకు మోహనరాజా దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్‌గా చేసింది. సాలిడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా రు. 200 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. మెగాస్టార్ నటించిన చివరి సినిమా ఆచార్య డిజాస్టర్ అయినా కూడా గాడ్ ఫాదర్ పై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు.

అయితే మేకర్లు సినిమా ప్రమోషన్లు చేయకపోవడంతో సినిమా పట్ల ట్రేడ్ వర్గాల్లోనూ.. ప్రేక్షకుల్లోనూ కొంత నిరాశ పూరిత వాతావరణం అయితే ఉంది. సినిమా విడుదలకు రెండు వారాలు కూడా లేదు. ఇంకా ప్రమోషన్లు ఎందుకు ? మొదలు పెట్టడం లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఎట్టకేలకు చిరంజీవి సినిమా ప్రమోషన్ మొదలుపెట్టారు. అది కూడా ఏకంగా ఆకాశంలో ఒక స్పెషల్ జెట్‌ విమానంలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించి అంచనాలు పెంచేశారు.

పైగా హాట్ యాంకర్ శ్రీముఖి – చిరంజీవి మధ్య సరదా సంభాషణలతో గాడ్ ఫాదర్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటివరకు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టలేదని విమర్శలు చేస్తూ వచ్చిన మెగా అభిమానులు.. ఇతర సినీ అభిమానులు ఇప్పుడు ఏకంగా ఆకాశంలో గాడ్ ఫాదర్ ప్రమోషన్లు ప్రారంభించడంతో షాక్ అవుతున్నారు. ఇక పెళ్లి తర్వాత నయనతార తెలుగులో నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ ప్రమోషన్లలో శ్రీముఖి – చిరంజీవి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చిరువేసిన పంచ డైలాగ్ కు శ్రీముఖి ఏకంగా ఐ లవ్ యు చిరంజీవి గారు.. తట్టుకోలేకపోతున్నా అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఏదేమైనా శ్రీముఖి – చిరంజీవి మధ్య అదిరిపోయే మాస్ ఇంటర్వ్యూ రెడీ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news