మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఇటీవల వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది క్రాక్‌కు ముందు వరుస ప్లాపులతో డీలా పడ్డ రవితేజ క్రాక్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఈ యేడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలో ఘోరంగా బాక్సాఫీస్ దగ్గర తన్నేయడంతో పాటు అందరూ మునిగిపోయాడు. ఇక ఇప్పుడు రవితేజ చేతిలో ఐదారు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇందులో ముందుగా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ధమాకా సినిమా రెడీ అవుతోంది. కమర్షియల్ సినిమాలు తీస్తారన్న పేరున్న నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు దర్శకుడు.
షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్టర్లు వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల హీరోయిన్గా నటించింది. మామూలుగా అయితే ఇప్పుడు కుర్రోళ్లు, యూత్‌లో శ్రీలీల అంటే మంచి క్రేజ్ ఉంది. శ్రీలీల అందాలు చూసేందుకు సినిమాలకు వెళ్లాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. శ్రీలీలకు తక్కువ టైంలోనే సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చేసింది.
అందుకే జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్గా ఆమె పేరు పరిశీలనకు వచ్చింది. ఇక ధమాకా నుంచి తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్‌లో కూడా రవితేజ శ్రీలీలకు రొమాంటిక్ సైగలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు శ్రీలీల ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నా…ఇది సినిమాకు, ఆమె కెరీర్‌కు మైనస్ అని కొందరు అంటున్నారు.
55 ఏళ్లు దాటేసిన ఆ ముసలి రవితేజతో 20 ఏళ్ల బ్యూటీ రొమాన్స్ ఏంట్రా బాబు..ఈ ముసలోడి రొమాన్స్ ఎలా చూడాల్రా బాబు అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అసలే రవితేజ ఫేస్‌లో ఒకప్పటి ఛరిష్మా లేదు. పైగా తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్‌లో సైతం రవితేజ ఫేస్ పూర్తిగా ముడతలు పడిపోయి ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడలేకపోయాం… మరి రేపు సినిమాలో రెండున్నర గంటల పాటు రవితేజను శ్రీలల పక్కన చూస్తే ఆ ఫెయిర్ ఏ మాత్రం బాగోదనే అంటున్నారు.
ఇక శ్రీలీల కూడా ఇలాంటి టైంలో స్టార్ హీరోలు, కుర్ర హీరోలను కాదనుకుని రవితేజ లాంటి ఏజ్డ్ హీరోలతో రొమాన్స్ చేస్తే ఆమె కెరీర్‌కే ఇబ్బంది అని కూడా అంటున్నారు. మరి ఇప్పటకి అయినా ఆమె సినిమాలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందేమో ? చూడాలి.