వహీదా రెహమాన్.. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఒక ఊపు ఊపిన రోజుల్లో వెండితెరను కుదిపేసిన.. బాలీ వుడ్ నటి. నేటి తరానికి పెద్దగా తెలియని నాయకి. రోజులు మారాయ్.. చిత్రంలో “ఏరువాకా సాగారో.. “ అనే పాటలో తళుక్కున మెరిసిన ఐటం సాంగ్‌లో ఆమె నటించి.. తెలుగు ప్రేక్షకులను కుదిపేశారు. అలాంటి నాయకిని.. ఎన్టీఆర్ తనపక్కన జోడీగా వద్దన్నారనేది.. సంచలన సృష్టించిన వార్త. ఇది నిజం. లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను రాముడిగా తీసుకున్నారు.
కానీ, సీతగా ఎవరిని తీసుకోవాలి? అనేది పెద్ద సమస్య అయింది. ఎందుకంటే.. ఈ సినిమా ఎన్ని రోజులు షూటింగ్ జరుగుతుందనేది.. చెప్పడం కష్టమని.. ముందుగానే ప్రకటించారు. అనుకున్నట్టుగానే మూడేళ్ల పాటు దీనిని షూట్ చేశారు. పైగా ఆ సమయంలో.. అందరూ బిజీ ఆర్టిస్టులే. ఈ క్రమంలో అంజలీదేవి.. సావిత్రి.. వంటివారు బిజీగా ఉండి.. చేయలేమని చెప్పారు. ఈ క్రమంలో లవకుశ కోసం.. వహీదా రెహమా న్‌ను సంప్రదించాలని.. నిర్ణయించారు. దీనికి దర్శకుడుగా వ్యవహరించిన సీ. పుల్లయ్యకు సాగతీస్తారనే పేరుంది.
ఆయనకు ఒక్కషాట్‌నచ్చకపోయినా.. దానిని పదే పదే తీస్తారు. దీంతో పెద్దగా ఆయన సినిమాల్లో ఎవరూ నటించేవారు కాదని.. అప్పట్లో టాక్. ఈ క్రమంలో వహీదాను తెస్తానని చెప్పారు. కానీ, దీనికి.. ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. మన తెలుగు అమ్మాయే ఉండాలని పట్టుబట్టారట. ఈ క్రమంలోహీరోయిన్‌ను ఎంపిక చేసే బాధ్యతను ఎన్టీఆర్‌కే అప్పగించేశారట.. పుల్లయ్య. అన్నగారు వెతికి వెతికి.. మొదట్లో సావిత్రిని అనుకున్నారు.కానీ, ఆమె అప్పటికే డేట్లు ఇచ్చేయడంతో.. అంజలీదేవిని సంప్రదించారు.
అయితే.. తన పార్ట్‌ను తొందరగా ముగిస్తానంటే.. ఓకే చెప్తానన్నారట. దీనికి హామీ ఇచ్చిన ఎన్టీఆర్ అలాగే శారు. అందుకే.. చిత్రం మూడేళ్లు తీసినా.. ఈ సినిమాలో .. సీత పాత్రను మాత్రం పుల్లయ్య జీవించి ఉన్నప్పుడే.. తీసేశారట. చివరి సీన్లకు మాత్రమే.. ఆయన కుమారుడు.. సీఎస్ రావు దర్శకత్వం వహించారు. సో.. ఇదీ.. కథ!!