సినీ రంగంలో ఎన్టీ ఆర్ శైలే విభిన్నంగా ఉండేదని అంటారు. ఆయన వ్యవహారం అందరికీ ఆదర్శమనే టాక్ కూడా నడిచింది. నిర్మాతలకు గౌరవం ఇవ్వడం.. దర్శకులతో మర్యాదగా మసులుకోవడం.. ఇతర నటీనటులతో కలివిడిగా ఉండడం అనేది అన్నాగారి లోఉన్న గొప్ప లక్షణాలుగా అప్పట్లో చెప్పుకొనేవా రు. ముఖ్యంగా ఎవరికి ఏ ఆపద వచ్చిందని తెలిసినా.. అన్నగారు ముందుండేవారు. ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకు ఆయన అపరిమితమైన గౌరవం ఇచ్చేవారు. వాళ్లను ఎవ్వరు గౌరవించకపోయినా ఎన్టీఆర్ సహించేవారు కాదు. రాజకీయాల్లోకి రాక ముందు వరకు ..ఆయన అందరితోనూ కలి సిమెలిసి తిరిగారు.
రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం కొంత దూరమయ్యారు. ఉమ్మడి ఏపీలో రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత.. అన్నగారి స్టయిలే మారిపోయింది. ఇక, ఆయన సొంత రాష్ట్రంలో ఉన్న కళాకారులకు ఇచ్చిన వాల్యూ ఓకే. మరి పరాయి భాషా నటుల విషయంలోనూ అన్నగారు ఇలానే ఉండేవారా ? అనేది ప్రశ్న. దీనికి పాజిటివ్‌గానే ఆన్సర్ వస్తోంది. ఇతర భాషా నటులకు కూడా.. అన్నగారు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చేవారు. వారిలోని కొత్త నైపుణ్యాలను ఆయన తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఎక్కడా కూడా ఇగోలకు పోకుండా ఉండేవారు. తమిళనాడును తీసుకుంటే.. శివాజీ గణేశన్, రాజా, రజనీకాంత్, కరుణానిధి కుటుంబాలతో అన్నగారికి.. చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. ఇక, కన్నడ (శాండిల్) సినీ రంగానికి వస్తే.. ప్రఖ్యాత నటుడు రాజ్‌కుమార్ నుంచి దర్శకుల వరకు అనేక మందితో ఎన్టీఆర్ అద్వితీయమైన స్నేహాన్ని కొనసాగించారు. వీరిలో రాజ్‌కుమార్ కుటుంబంతో అన్నగారికి ప్రత్యేక అనుబంధం కూడా ఉంది.
ఇక, హిందీ మూవీల విషయానికి వస్తే.. రాజ్‌బబ్బర్, అమ్రీష్‌పురి, అమితాబ్ బచ్చన్.. వంటి అగ్రహీరోలు.. (అప్పట్లో అప్ కమింగ్ ఆర్టిస్టులు) అన్నగారి కరచాలనం కోసం.. తపించేవారు. దీనికి అన్నగారు కూడా అంతే రియాక్ట్ అయ్యేవారు. ఏదేమైనా.. రాజకీయ రంగంలోకి రాకముందు.. ఇతర భాషా నటులకు.. అన్నగారు ఎంతో గౌరవం ఇచ్చేవారు. వారు కూడా అన్నగారంటే ప్రాణం పెట్టేవారు. ఈ పరిణామం.. చాలా ఏళ్లపాటు కొనసాగింది.అయితే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. అన్నగారు దాదాపు అందరికీ దూరమయ్యారు.