Moviesఎలాంటి బట్టలేసుకోమన్నా వేసుకుంది.. టాలీవుడ్‌లో తాప్సీ కెరీర్‌ నాశ‌నం చేసిందెవ‌రు...!

ఎలాంటి బట్టలేసుకోమన్నా వేసుకుంది.. టాలీవుడ్‌లో తాప్సీ కెరీర్‌ నాశ‌నం చేసిందెవ‌రు…!

హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత దాదాపు 90 శాతం మంది దేనికైనా సిద్ధమవుతారు. అంటే గ్లామర్ పాత్రలు చేయడానికైనా, ఎక్స్‌ఫోజింగ్ చేయడానికైనా, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయడానికైనా.. లిప్ కిస్ సన్నివేశాలకైనా. ఇక వారికే అనిపిస్తే ఛాలెంజింగ్ రోల్స్ ఏది వచ్చినా కాదనరు. ముఖ్యంగా ముంబైలో మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేవారికి పెద్దగా ఆంక్షలు అంటూ ఏవీ ఉండవు. కానీ, ఏ ప్రాంతం నుంచి వచ్చినవారైన సాయి పల్లవి, నిత్యా మీనన్ లాంటి వారు మాత్రం కాస్త సెటిల్డ్‌గా ఉంటారు.

తాప్సీ కూడా అలా మంచి ఆశలు పెట్టుకొచ్చిన అమ్మాయే. సినిమా ఇండస్ట్రీ కాబట్టి అన్నిటికీ సిద్దపడే వచ్చింది. మొదటి సినిమా దర్శకేంద్రుడు లాంటి పెద్ద దర్శకుడు. మంచు మనోజ్ లాంటి పెద్ద ఫ్యామిలీ హీరో. కాబట్టి మొదటి సినిమా నుంచే అందాల ఆరబోతకు సై అనేసింది. దర్శకేంద్రుడి స్టైల్లో ఉండే సినిమా కాబట్టి ఎంత పొదుపుగా బట్టలేసుకోమన్నా వేసుకుంది. వెల్లకిలా పడుకొని బొడ్డుమీద కొబ్బరి చిప్పలు వేసినా బాధను భరించింది.

ఆ తర్వాత సినిమాలలోనూ దర్శకులు చెప్పిన విధంగా తనలోని అందాలను ఆరబోసింది. రొమాంటిక్ సీన్స్ చేసింది. కానీ, తాప్సీ కెరీర్‌లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా తప్ప ఒక్క హిట్ కూడా లేదు. అది కూడా కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ కావడంతో తాప్సీకి పెద్దగా ఒరిగిందేమీ లేదు. వెంకటేష్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్ సరసన నటించినా తాప్సీ టాలీవుడ్‌లో సక్సెస్ సాధించలేకపోయింది. ఇక్కడ హిట్స్ లేకపోవడంతో కొంద‌రు ప‌ని క‌ట్టుకుని మ‌రీ ఫ్లాప్ హీరోయిన్‌గా డిసైడ్ చేశారు.

అదే సమయంలో తాప్సీకి బాలీవుడ్ నుంచి పిలుపు రావడం అక్కడ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు చేసినా ఆ తర్వాత పింక్, బద్లా లాంటి కథా బలమున్న సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకోవడంతో తాప్సీ రాత మారిపోయింది. అక్కడ అద్భుతమైన కథల్లో నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. అంతేకాదు, టాలీవుడ్‌లో రిజెక్ట్ చేసిన హీరోయిన్ బాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగుతుంది. ఇక్కడితో ఆగలేదు..నిర్మాతగా కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను మొదలు పెట్టి సినిమాలు నిర్మిస్తోంది. ఎప్పుడూ ఎవరీని తక్కువంచనా వేయకూడదనడానికి తాప్సీనే ఓ ఉదాహరణ అని దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news