Moviesఅంత్యక్రియలు అక్కడే ఎందుకు చేస్తున్నారో తెలుసా..కృష్ణం రాజు ప్రభాస్ కి చెప్పిన...

అంత్యక్రియలు అక్కడే ఎందుకు చేస్తున్నారో తెలుసా..కృష్ణం రాజు ప్రభాస్ కి చెప్పిన సీక్రేట్ ఇదే ..!!

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు నిన్న తెల్లవారుజామున 3:15 నిమిషాలకు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. బిగ్ బిగ్ స్టార్స్ అందరూ ఇప్పుడు ప్రభాస్ ఇంటి వద్దనే కృష్ణం రాజు పార్థివ దేహం వద్ద ఉన్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న కృష్ణంరాజు.. ఆదివారం తెల్లవారుజామున ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన అంతక్రియలను నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తి చేయనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

కాగా కృష్ణంరాజు ఇక లేరనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కడసారి చూపుల కోసం ప్రజలు అభిమానులు సినీ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియ నిర్వహిస్తామని ఇప్పటికే కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా చేవెళ్ల మెయినా బాద్ దగ్గరలోని కనక మామిడి ఫామ్ హౌస్ లో కృష్ణం రాజు అంతక్రియలు జరుగుతాయని తెలుస్తుంది. ఇంటి నుంచి ఆయన పార్థివ దేహం 11:30 కు బయలుదేరిందని కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. అంతేకాదు కృష్ణంరాజు గారి అంతిమయాత్రలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

అయితే కృష్ణంరాజు అంత్యక్రియలు ఎందుకు కనకమామిడి ఫామ్ హౌస్ లోనే జరుగుతున్నాయి అని అభిమానుల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నిజానికి ఈ ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు ఓ ఇంటిని కట్టించుకోవాలని ఆశ పడ్డారట . ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉన్న హౌస్ మరి కొద్ది నెలల్లోనే కంప్లీట్ కానుంది . ఆ తర్వాత తన జీవితం మొత్తం ఇక్కడే గడపాలని కృష్ణంరాజు ఎంతో ఇష్టపడి ఇంటిని కట్టించుకుంటున్నారట .

కానీ ఇంతలోపే ఆయన మరణించడం అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. అంతేకాదు ప్రభాస్ కి కృష్ణంరాజు సరదాగా చెప్పుకొచ్చేవారట. “నేను చనిపోతే నన్ను ఇక్కడే పూడ్చిపెట్టండి అప్పుడు నేను నా ఇల్లుని చూసుకుంటూ ఉంటాను ఎప్పుడు” అంటూ చెప్పేవారట. ఆ మాటలు గుర్తు చేసుకున్న ప్రభాస్ ఆయన అంత్యక్రియలను కనుక మామిడి ఫామ్ హౌస్ లో జరిపించాలని డిసైడ్ అయ్యారట. కాగా మరికొద్ది సేపట్లో కృష్ణం రాజు అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news