Moviesఅప్పుడు సమంత..ఇప్పుడు దీపికా ..అదే సమస్య తో అల్లాడిపోతున్నారుగా..!?

అప్పుడు సమంత..ఇప్పుడు దీపికా ..అదే సమస్య తో అల్లాడిపోతున్నారుగా..!?

“ఏంటో కలియుగంలో పోయేకాలం అంటే ఇదే కాబోలు” మనిషికి తెలియని వింత వింత రోగాలు వెలుగులోకి వస్తున్నాయి. లేకపోతే మనిషిని మూడు అక్షరాల కరోనా అనే పదం ముప్పు తిప్పులు పెట్టి కోట్లాదిమంది జనాలను అల్లాడిస్తుందా..? కలియుగం అంతరించిపోతుంది అని చెప్పడానికి ఇది చాలదు. కాగా సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది హీరోయిన్స్ జబ్బుల పాలవుతున్నారు. రీజన్స్ ఏంటో తెలియదు కానీ. మరీ ముఖ్యంగా స్టార్స్.. ఫుల్ డైట్ ఫాలో అవుతున్న అందాల ముద్దుగుమ్మలే ఇలా అనారోగ్యాలకు గురవుతూ బాధపడిపోతున్నారు.

మనకు తెలిసిందే గత కొంతకాలంగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంది. అంతేకాదు ఆమెకు ఆరోగ్యం బాగోలేదని హెల్త్ ఇష్యూ కారణంగా అమెరికాకి వెళ్లిందని వార్తలు వైరల్ అయ్యాయి . అయితే దీనిపై ఆమె మేనేజర్ స్పందించినప్పటికీ ఇప్పటివరకు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం కారణంగా అందరూ సమంత ఆరోగ్యం బాగాలేదు అనే వార్త నమ్ముతున్నారు. అంతేకాదు సమంత తన గర్భసంచిని కూడా తీసేసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమనడం సంచలనంగా మారింది .

అయితే ఇప్పుడు ఇదే బాధతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా బాధపడుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే దీపిక పదుకొనే ఆరోగ్యం బాగోలేని కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అయింది. ముంబైలోని ప్రముఖ హాస్పిటల్ లో అడ్మిట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆమె గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందని అందుకే ఆమె పిల్లలు కనడానికి ఇష్టం పడలేదని ఆ సమస్య కారణంగానే ఇప్పుడు దీపిక ఆరోగ్యం మరింత క్షీణించిందని.. ఈ క్రమంలోనే డాక్టర్లు ఆమెకు గర్భసంచి తీసేయాలని సజెస్ట్ చేశారని ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. దీంతో గతంలో సమంత పై అదే రూమర్.. ఇప్పుడు దీపికా పదుకొనే పై అదే రూమర్ రావడంతో సినీ జనాలలో వణుకు మొదలైంది .

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news