Moviesభారీ అందాలున్నా రితిక సింగ్‌ని పక్కన పెట్టింది అందుకేనట..!

భారీ అందాలున్నా రితిక సింగ్‌ని పక్కన పెట్టింది అందుకేనట..!

క్రీడా నేపథ్యంలో సినిమా అంటే తప్పకుండా ఏ ఆట నేపథ్యంగా కథ సాగుతుందో ఆ ఆటలో ప్రముఖులైన వారినే తీసుకుంటారు. అయితే, సినిమా అనేది ఫక్తు కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కేది. భాష ఏదైనా అంతిమంగా చూసేది పెట్టిన పెట్టుబడికి మరో సినిమా తీసేంత డబ్బు నిర్మాతకి రావాలి. కానీ, అది అన్ని సినిమాల విషయంలో ఎప్పుడూ జరగదు. ఇక కమర్షియల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినవారే ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టం.

ఇక ఇలా క్రీడా నేపథ్యంలో సాగే కథ ద్వారా ఎంట్రీ ఇస్తే దాదాపు అందరూ ఆ అమ్మాయిని అదే కోణంలో చూస్తారు. దీనివల్ల కమర్షియల్ సినిమాలో నటిస్తే ఆదరణ దక్కడం సాధ్యం కాని విషయం. ఇప్పటికే ఈ విషయం చాలామంది విషయంలో ఇతర భాషలలోనూ ప్రూవ్ అయింది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దంగల్ సినిమానే.

ఈ సినిమాలో ఆయన కూతుళ్ళుగా నటించిన యంగ్ బ్యూటీస్ ఫాతిమా సనాషేక్, సాన్యా మల్‌హోత్రా.
వీరిని కమర్షియల్ హీరోయిన్స్‌గా చూడటానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. ఇదే మన సౌత్ బ్యూటీ రితికా సింగ్ విషయంలోనూ జరిగింది. మొదటి సినిమా మూడు భాషలలో బ్లాక్ బస్టర్. స్వతగా మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి అయిన రితిక ధృడమైన శరీరాకృతి ‘ఇరుదచుట్రు’ సినిమాకి బాగా సూటైంది.

ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. లేడి డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. ఇక్కడ కూడా రితిక నటించింది. సినిమా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత రాఘవ లారెన్స్ నటించిన శివలింగ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్.

అయితే ఆ తర్వాత మాత్రం ఏదో సినిమాలు చేస్తుందంటే చేస్తుంది గానీ..ఆశించిన స్టార్ డం మాత్రం రావడం లేదు. దీనికి కారణం ప్రేక్షకులు రితికను కమర్షియల్ హీరోయిన్‌గా చూడకపోవడమే. మంచి హైట్.. భారీ ఎద అందాల ప్రదర్శనకి రొమాంటిక్ సీన్స్‌కి స్కిన్ షోకి అమ్మడు రెడీ. కానీ ఆ స్థాయి కథల్లో నటించే అవకాశాలు మేకర్స్ ఇవ్వలేకపోతున్నారు. గురు సినిమా వల్ల పేరు అవార్డులు దక్కాయి గానీ..అవకాశాలే ఆశించినతంగా దక్కడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news