నివేదా థామస్ – రెజీనా ప్రధాన పాత్రల్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శాకిని డాకిని. ఈ సినిమా కథ చూస్తే శాలిని (నివేతా థామస్) , డామిని (రెజీనా) పోలీస్ ట్రైనింగ్ కోసం పోలీస్ అకాడమీలో జాయిన్ అవుతారు. ఇద్దరి మధ్య ఇగో సమస్య వస్తుంది. అయితే కొన్ని సంఘటనల తర్వాత వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఓ రోజు రాత్రి వీరు బయటకు వచ్చినప్పుడు అనుకోకుండా ఓ అమ్మాయి కిడ్నాప్ అవ్వడం చూస్తారు. ఆ అమ్మాయిని సేవ్ చేసేందుకు శాలిని, డామిని ఏం చేశారు ? ఈ కిడ్నాప్ వెనక ఉన్నది ఎవరు ? ఆ అమ్మాయిని వీళ్లు ఎలా ? కాపాడారు అన్నదే ఈ సినిమా స్టోరీ.
ఈ సినిమాకు కథ ప్లస్ పాయింట్. కథ జరిగిన నేపథ్యంతో పాటు దర్శకుడు సుధీర్‌వర్మ రాసుకున్న అంశాలు, ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. ఇద్దరమ్మాయిల మధ్య ఇగో సీన్లు కూడా సినిమాకు ప్లస్. ఇక రెజీనా తన పాత్రలో బాగా నటించింది. నివేదా కూడా కొన్ని ఎక్స్‌ప్రెషన్లు చక్కగా పలికించింది. ఇద్దరూ తమ మార్క్ టైమింగ్‌తో అలరించారు. రెజీనా, నివేద తమ నటనలో ఎంతో వేరియేషన్స్ చూపించారు.
సినిమా కథ, పాత్రలు చిత్రీకరణ బాగున్నా దర్శకుడు కథను చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. పాత్రలు పరిచయానికే చాలా టైం వేస్ట్ చేయడంతో ఫస్టాఫ్ బోరింగ్‌గా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ప్లాట్‌లో సినిమాను నడిపించడంతో బోరింగ్‌గా ఉంటూ ఆసక్తిగా అనిపించదు. పైగా కమర్షియల్ హంగులకు ఈ సినిమా దూరంగా ఉన్నట్టు ఉంటుంది. సెకండాఫ్ కూడా బోరింగ్‌గానే నడుస్తుంది.
సుధీర్ వర్మ దర్శకుడిగానే కాకుండా, అటు రచయితగా కూడా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయలేదు. సినిమా స్క్రిఫ్ట్ మీద కూడా పెద్దగా కాన్‌సంట్రేషన్ అయితే చేయలేదు. మ్యూజిక్ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. సినిమాటోగ్రపీ ఓకే. ఫైనల్‌గా శాకిని డాకిని అంటూ వచ్చిన ఈ డిఫరెంట్ మూవీ స్లో నెరేషన్, బోర్ ట్రీట్మెంట్‌తో ప్రేక్షకులను విసిగించింది.