మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘రంగరంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించగా.. తమిళంలో అర్జున్‌రెడ్డి సినిమాను రీమేక్ చేసిన గీరిశాయ ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. పవన్ బర్త్ డే కానుకగా ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ఫ్యామిలీ హీరో సినిమా కావడంతో పాటు ఉప్పెన లాంటి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన వైష్ణవ్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక టీజర్లు, ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై వైష్ణవ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఉప్పెన హిట్ అయినా ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండపొలం సినిమా నిరాశ పరిచింది. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా ట్రాక్‌లోకి రావాలన్న పట్టుదలతోనే ఈ సినిమా చేశాడు. అయితే సినిమాకు ప్రీమియర్ల నుంచే మిక్స్ డ్ టాక్ వస్తోంది.
సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అయినా.. గతంలో వచ్చిన సినిమాల స్టైల్లోనే ఉందని అంటున్నారు. మరి కొందరు మాత్రం రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని అంటున్నారు. ఫ్యామిలీ ఎపిసోడ్స్‌లో కొన్ని బాగున్నాయని… క్లీన్ లవ్ స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడని అంటున్నారు. అయితే సినిమా అంతా ప్రేక్షకుడికి ముందే తెలిసిపోయేలా ఉండడంతో ఏ మాత్రం ఆసక్తితో ఉండదని ఎక్కువ మంది చెపుతున్నారు.
ఫస్టాఫే ఉన్నంతలో బెటర్ అని.. సెకండాఫ్ మరీ బోరింగ్‌గా ఉంటుందని కూడా కొందరు చెపుతున్నారు. ఓవరాల్‌గా కొంత ఫ్యామిలీ స్టోరీ, కాసిన్ని నవ్వులు తప్పా సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర నిలబడదనే ఎక్కువ మంది చెపుతున్నారు. వైష్ణవ్‌తేజ్‌కు నెక్ట్స్ టైం బెటర్ లక్ అని ఎక్కువ మంది అంటున్నారు.