MoviesTL రివ్యూ: రంగ రంగ వైభ‌వంగా .. ప‌ర‌మ రొటీన్ ఫ్యామిలీ...

TL రివ్యూ: రంగ రంగ వైభ‌వంగా .. ప‌ర‌మ రొటీన్ ఫ్యామిలీ డ్రామా…!

మెగా మేన‌ళ్లుడు వైష్ణ‌వ్ తేజ్ తొలి సినిమా ఉప్పెన‌తో సూప‌ర్ హిట్ కొట్టి పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు. ఆ సినిమా విజ‌యంతో ఒక్క‌సారిగా స్టార్ అయిపోయాడు. అయితే రెండో సినిమా ఏకంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన కొండ‌పొలం డిజాస్ట‌ర్ అయ్యింది. ఇక ఇప్పుడు అర్జున్‌రెడ్డి సినిమాను త‌మిళంలో రీమేక్ చేసిన గీరిశాయ ద‌ర్శ‌క‌త్వంలో రంగ రంగ వైభ‌వంగా సినిమా చేశాడు, టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆస‌క్తి రేపిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
గ‌తంలో మ‌నం ఖుషితో పాటు కొన్ని సినిమాల్లో చూసిన‌ట్టుగానే హీరో, హీరోయిన్లు ఒకే రోజు ఒకే టైంలో పుడ‌తాడు. వారిద్ద‌రి తండ్రులు ప్రాణ స్నేహితులు… వీరు ఒకే స్కూల్లో చ‌దువుతూ ఉంటారు. అయితే స్కూల్లో జ‌రిగిన గొడ‌వ కార‌ణంగా వీరి మధ్య మాట‌లు ఉండ‌వు. వీరి మ‌ధ్య అభిమానం, ప్రేమ ఉన్నా.. వీరి కుటుంబాలు క‌లిసే ఉన్నా వీరు మాత్రం మాట్లాడుకోరు. హీరో అన్న‌య్య త‌న పెద్ద చెల్లిని ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్ కొడుకుకు ఇచ్చి పెళ్లి చేస్తే త‌న‌కు రాజ‌కీయంగా క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తాడు. అయితే ఆమె హీరో అన్న‌య్య‌ను ప్రేమించాన‌ని చెపుతుంది.

దీంతో హీరోయిన్ కృతిక‌శ‌ర్మ అన్న‌య్య హీరో అన్న‌ను కొడ‌తాడు. దీంతో రెండు కుటుంబాల మ‌ధ్య గ్యాప్ పెరుగుతుంది. అదే స‌మ‌యంలో హీరో అక్క‌, హీరో అన్న లేచిపోదామ‌ని చూస్తే హీరో వాళ్ల‌ను వారిస్తాడు. ఆ త‌ర్వాత హీరోయిన్ అన్న‌కు రాజ‌కీయంగా సాయం చేస్తాడు. చివ‌ర‌కు హీరో, హీరోయిన్ల కుటుంబాల‌తో పాటు వారు ఎలా క‌లిశారు అన్న‌దే క‌థ‌.

విశ్లేష‌ణ :
సినిమా ఫ‌స్టాఫ్ అంతా యూత్‌ను ఆక‌ట్టుకునే క‌థ‌నంతో న‌డుస్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌తో క‌థ‌ను న‌డిపించినా… అదంతా పాత చింత‌కాయ ప‌చ్చ‌డి మాదిరిగా ఉంటుంది. వైష్ణ‌వ్‌తేజ్ పాత్ర వ‌ర‌కు న‌టించినా… ఇంకా రాటు దేలాల్సి ఉంది. హీరోయిన్ కేతిక శ‌ర్మ ముద్దు,మోముతో మురిపించింది. సినిమాలో బాగా న‌టించ‌డానికి ఆమె తాప‌త్ర‌య ప‌డిన‌ట్టుగా ఉంది. ఇక త‌ల్లిదండ్రులుగా చేసిన నరేష్, ప్రభు, ప్రగతి, తులసి చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

 

ద‌ర్శ‌కుడు గిరీశాయ ఫ్యూర్ ల‌వ్ స్టోరీ లైన్ తీసుకున్నా దానిని ఆక‌ట్టుకునేలా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ బాగోలేదు. ఇక ఈ సీన్లు బాగా స్లోగా సాగుతూ ప్రేక్ష‌కుల‌ను బోర్ కొట్టించేస్తాయి. అస‌లు వీరి ట్రాక్‌లో బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ కూడా లేదు. ఇక ఖుషి, నువ్వేకావాలి, ఆనందం, నిన్నే పెళ్లాడ‌తా సినిమాల్లోని సీన్లు తీసుకువ‌చ్చి కాపీ కొట్టిన‌ట్టుగా ఉంది.

దీనికి తోడు స్లో నెరేష‌న్‌తో పాటు బోరింగ్ ట్రీట్‌మెంట్‌, ఫేక్ ఎమోష‌న్స్‌తో సినిమా సాగుతుంది. ఫ‌స్టాఫ్‌లో కీల‌క సీన్లు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్ మిన‌హా మిగిలిన‌వి ఆక‌ట్టుకోవు. సెకండాఫ్‌ను ఎమోష‌న‌ల్‌గా న‌డుపుదామ‌ని ద‌ర్శ‌కుడు అనుకున్నా అది వ‌ర్క‌వుట్ కాలేదు. పైగా సిల్లీ ఎమోష‌న్స్‌తో పాటు పేల‌వ‌మైన సీన్ల‌తో సినిమా బోరింగ్‌గా మారింది. ఆలీ, స‌త్య కామెడీ కాస్తంత రిలీఫ్‌.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నికల్‌గా చూస్తే దేవిశ్రీ మ్యూజిక్‌లో రెండు పాట‌లు మాత్ర‌మే బాగున్నాయి. హీరో, హీరోయిన్ల ల‌వ్ సాంగ్ బాగుంది. అంత‌కు మించి దేవీ చిన్న సినిమా అనో ఎందుకో గాని పెద్ద‌గా దృష్టి పెట్టిన‌ట్టుగా లేదు. ఎడిటింగ్ ఓకే … కొన్ని బోరింగ్ సీన్లు ట్రిమ్ చేస్తే బాగుండేది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఇక ద‌ర్శ‌కుడు లైన్ కొత్త‌గా ఉన్నా ఆక‌ట్టుకునే స్క్రీన్ ప్లే లేదు. దీనికి తోడు పాత సినిమాల ప్ర‌భావం ఎక్కువుగా ఉంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
ఫ్యూర్ ల‌వ్ స్టోరీగా వ‌చ్చిన ఈ రంగ రంగ వైభ‌వంగా ఎమోష‌న‌ల్‌ఫీల్ గుడ్ డ్రామా. అయితే రొటీన్ ప్లాట్స్‌, స్లో నెరేష‌న్‌, బోరింగ్ ట్రీట్‌మెంట్‌, రెగ్యుల‌ర్ సిల్లీ డ్రామా సినిమాకు మైన‌స్ అయ్యింది. ల‌వ‌ర్స్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కొన్ని సీన్లు న‌చ్చ‌డం మిన‌హా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికేం లేదు. వ‌రుణ్‌తేజ్‌కు ఈ సినిమా హిట్ వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు.

ఫైన‌ల్ పంచ్ : రంగ రంగ వైష్ణ‌వ్ రొటీన్ చేశావుగా

రంగ రంగ వైభ‌వంగా TL రేటింగ్ : 2.25 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news