ఓ మై గాడ్ బ్రహ్మాస్త్ర సినిమా అన్ బిలివబుల్ రికార్డ్. నిజంగా ఇలాంటి ఓ ఘనత సాధిస్తుందని బ్రహ్మాస్త్ర చిత్ర యూనిట్ కూడా గెస్ చేయలేకపోయింది. అఫ్ కోర్స్ బ్రహ్మాస్త్ర సినిమాకు ప్రమోషన్స్ బీభత్సంగా చేశారు. అలియా భట్, రణబీర్ కపూర్ , రాజమౌళి , నాగార్జున డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. అందరూ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీలైనంత విధంగా సినిమాను ప్రమోట్ చేశారు. కానీ ఈ రేంజ్ రికార్డ్ సాధిస్తుందని ఎవరు అనుకోలేదు..
మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానున్న బ్రహ్మాస్త్ర సినిమా ..ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను సైతం వెనక్కి నెట్టింది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు బ్రహ్మాస్త్ర సినిమా పైనే పడ్డాయి . రణబీర్ కపూర్ ఆయన సతీమణి అలియా భట్ పెళ్లి తర్వాత మొదటిగా కలిసి నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తనదైన స్టైల్ లో తెరకి ఎక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్..టాలీవుడ్ బడా హీరో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించారు. తెలుగులో బ్రహ్మాస్త్రం చిత్రాన్ని రాజమౌళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో సీరియస్ గా పాల్గొంటున్నారు రాజమౌళి.
కాగా సెప్టెంబర్ 6 ఉదయం 11:30 గంటలకు హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ..మేజర్ థియేటర్స్ చైనా ఐనాక్స్ ,సినీప్లెక్స్ ,పివిఆర్ లలో ఏకంగా 1.31 లక్షల అడ్వాన్స్డ్ టికెట్ బుకింగ్స్ బ్రహ్మాస్త్ర సినిమాకు అమ్ముడుపోయాయి. దీంతో బ్రహ్మాస్త్ర సంచలన రికార్డు నెలకొల్పింది . అంతకుముందు ఈ రికార్డ్ ఆర్ఆర్ఆర్.. బూల్ భూలియా 2 సాధించి ఉన్నింది. అయితే ఇప్పుడు ఆ సినిమాల కంటే ఎక్కువగా బ్రహ్మాస్త్ర రికార్డ్ టికెట్స్ అమ్ముడుపోవడంతో సంచలనంగా మారింది . అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 కంటే చాలా వెనకబడింది బ్రహ్మాస్త్రం. మనకు తెలిసిందే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజిఎఫ్ 2 హిందీ సినిమా ఏకంగా 5.05 లక్షల టికెట్స్ ముందస్తుగా బుక్ చేసుకొని ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. కాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను వెనక్కినెట్టినందుకు బ్రహ్మాస్త్ర చిత్ర బృందం సంతోషిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.