మనకు తెలిసిందే టాలీవుడ్ సీనియర్ హీరో.. రెబల్ స్టార్.. కృష్ణంరాజు నిన్న తెల్లవారుజామున అనారోగ్య కారణంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సినీ ప్రముఖులు ఆయన అభిమానులు హుటాహుటిన ఆయనంటున్న ఏఐజి హాస్పిటల్ వద్దకు.. అలాగే ఆయన పార్థివదేహం తీసుకొచ్చిన కృష్ణంరాజు ఇంటికి భారీ సంఖ్యలో తరలివచ్చారు .ఒకప్పుడు మల్టీ టాలెంట్ తో అలరించిన ఆయన జీవచ్ఛవంలా ప్రాణం లేకుండా పడి ఉండడం చూసి స్టార్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి ముఖ్యంగా ప్రభాస్ కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనకు తెలిసిందే.
కాగా వివాదానికి తెర తీసే రాంగోపాల్ వర్మ రీసెంట్ గా కృష్ణంరాజు మృతి పై ఓ ట్వీట్ చేశాడు . దీంతో సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అంతేకాదు కొందరు నిజమే కదా ఆర్జీవి చెప్పింది ఆయన మాటలను తప్పుపడతారే అంటూ ఉంటే ..మరి కొందరు బుద్ధుందా ఆర్జీవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రాంగోపాల్ వర్మ ఏం ట్వీట్ చేశారో తెలుసా..
ఆయన ట్విట్ చేస్తూ ..”భక్తకన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు”.. లాంటి అత్యంత గొప్ప చిత్రాలను అందించిన మహానటుడు కృష్ణం రాజు మరణిస్తే కనీసం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆయన మరణాన్ని కూడా గౌరవించలేని స్థితిలో ఉన్నారు. ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు.. సిగ్గు” అంటూ ట్విట్ చేశాడు .
అంతే కాదు ..”కృష్ణ గారికి , మురళీమోహన్ గారికి ,చిరంజీవి గారికి ,మోహన్ బాబు గారికి ,బాలయ్యకి ,ప్రభాస్ కి, మహేష్ , కళ్యాణ్ కి నేను చెప్పాలనుకునేది ఒక్కటే రేపు ఇదే పొజిషన్లో మీరు ఉంటే చేసేదేందంటే ఇలాంటిదే . ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మ వేసుకోవడం మంచిది..”అంటూ ఘాటైన ట్విట్ చేశాడు దీంతో సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అయితే ఇది నిజమే కదా అంటూ ఆర్జీవికి సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు.
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022
కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్‌కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.
— Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022