తెలుగులో ఒక హీరోకి గానీ, దర్శకుడికి గానీ, నిర్మాతలకి గానీ కొత్తగా వచ్చిన హీరోయిన్ అయినా, ఆల్రెడీ సక్సెస్‌లలో ఉన్న హీరోయిన్ అయినా ట్యూన్ అయ్యారంటే వారి దశ తిరిగినట్టే అనుకోవాలి. వారే హీరోయిన్స్‌కు ఫ్లాప్స్ వస్తున్నా కూడా వేలు పట్టుకొని నడిపిస్తుంటారు. దీనికి ఉదాహరణ పూజా హెగ్డే అనుకోవచ్చు. ఈమెకి కెరీర్ ప్రారంభంలో వరుస ఫ్లాప్స్ పలకరించినా కూడా తెలుగులో దిల్ రాజు, హరీష్ శంకర్, త్రివిక్రమ్ లాంటి వారు ఉండబట్టి నిలబడింది.
ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‌గా వెలుగుతోంది. అయితే, తెలుగులో రెండే రెండు సినిమాలు చేసిన కియారా అద్వానీ ఓ భారీ హిట్ ఓ భారీ డిజాస్టర్‌ను చూసింది. కారణం ఏదైనా రెండవ సినిమా ఫ్లాప్ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా చెలరేగిపోతోంది. హిందీలో చేసిన లస్ట్ స్టోరీస్, తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ కిరాను ఎక్కడికో తీసుకెళ్ళాయి.
దాంతో అమ్మడికి బాలీవుడ్‌లో అన్నీ పెద్ద సినిమాలలో నటించే అవకాశాలనే అందుకుంటోంది. అక్షయ్ కుమార్ సరసనే ఆ మధ్య వరుసగా సినిమాలు చేసే ఛాన్స్ అందుకుంది. అయితే, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్సీ 15లో ఇప్పుడు కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు దాదాపుగా రు. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో ముందు ఛాయిస్ కియారా అద్వానీ కాదట. రష్మిక మందన్న లేదా పూజా హెగ్డేలలో ఒకరిని తీసుకోవాలనుకున్నారట. కానీ, రాం చరణ్ అలా కాదని ఇప్పుడు హిందీలో బాగా క్రేజ్ ఉన్న కియారాను తీసుకుందామని మొహమాటం లేకుండ చెప్పారట. కియారాతో ఆల్రెడీ నటించిన చరణ్ హిట్ కొట్టలేకపోయాడు. ఇది కూడా ఓ కారణం అని టాక్ ఉంది.
ఇక తెలుగులో గానీ మిగతా భాషలలో గానీ కియారా నటించలేదు.. కాబట్టి సౌత్‌లో తను నటించడానికి పెద్దగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయదని ఓ ఆలోచన అట. ఇందులో ఎంతవరకు నిజముందో గానీ, ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం కియారా ఆర్సీ 15లో ఎంపిక అవడానికి చరణ్ హ్యాండ్ ఉందని అంటున్నారు.