ప్రతీ దర్శకుడిలో రొమాంటిక్ యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది. తాను తీసే సినిమాలో హీరోయిన్‌ను కొన్ని సన్నివేశాలలో అలాగే సాంగ్స్‌లో చాలా రొమాంటిక్‌గా చూపిస్తారు. ఈ విషయంలో అందరూ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి చెప్పుకుంటారు. ఆయన మాత్రమే కాదు, సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ..ఆయన శిష్యులు కృష్ణవంశీ, హరీష్ శంకర్ లాంటి వారు కూడా తమ సినిమాలలో హీరోయిన్స్‌ను అవకాశం ఉంటే వీలైనంత గ్లామర్‌గా చూపిస్తారు.
వీరందరికీ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గురువు అని చెప్పుకోక తప్పదు. ఎన్ని సినిమాలు చేశారో అన్ని సినిమాలలోనూ హీరోయిన్‌ను తెగ చూపించారు. రాఘవేంద్ర రావు సినిమా అంటే హీరోయిన్ బొడ్డు మీద పూలు పళ్ళు, పాలు..అంతకంటే కొత్తగా ఏం కనిపించినా వేసేస్తారు. దర్శకేంద్రుడి సాంగ్స్ చూస్తే ఒళ్ళు వేడెక్కాల్సిందే. ఆ తర్వాత పూరి జగన్నాథ్, కృష్ణవంశీ సినిమాలలో హీరోయిన్స్ గురించి చెప్పొచ్చు.
అయితే, ఇప్పటివరకు వీరి గురించే మాట్లాడుకున్నాము గానీ, ఇండియన్ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్ళిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి మాత్రం మాట్లాడుకోలేదు. ఆయన సినిమాలను గనక పరిశీలిస్తే రాజమౌళి లో కూడా మంచి రసికుడున్నాడని అర్థమవుతుంది. కమర్షియల్ సినిమా అనే ఫార్ములాను పాటిస్తూనే అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాలను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాలో అద్భుతమైన రొమాంటిక్ సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్స్, లిప్ కిస్సులు ఉంటాయి.
విక్రమార్కుడు సినిమాలో అనుష్క, రవితేజ మధ్య ఉన్న సన్నివేశాలు సాంగ్స్ తెలిసిందే. బాహుబలి సినిమాలోనూ ఇది గమనించవచ్చు. మగధీర సినిమాలో రాం చరణ్, కాజల్ అగర్వాల్ మధ్య ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలున్నాయి. సింహాద్రి సినిమాలో రమ్యకృష్ణ పాట ఒకటి చాలు..మాస్ ఆడియన్స్ వెర్రెక్కిపోవడానికి. ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ఎంతసేపటికీ జక్కన్న యాక్షన్స్ సీన్స్ గురించి..భారీ యుద్ధ సన్నివేశాల గురించే మాట్లాడుకుంటారు. అలా రాజమౌళిలో కూడా తెలియని గ్లామర్, రొమాంటిక్ కోణం చాలానే ఉంది.