టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘువరన్. విలన్ గా అనేక చిత్రాలలో నటించిన రఘువరన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. రఘువరన్‌ది డిఫరెంట్ విలనిజం. ఆయన విలనిజం ఎవ్వరికి రాదు. కేవలం విలన్ పాత్రలలో నటించడమే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో హీరో తండ్రిగా ఎమోషనల్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఏడిపించారు. అయితే రఘువరన్ పాజిటివ్ పాత్రలలో నటించినప్పటికీ ఆయనను ప్రేక్షకులు విలన్ గానే గుర్తుపెట్టుకున్నారు. దానికి కారణం ఒకప్పుడు రఘువరన్ చూపించిన విలనిజం ఆ రేంజ్ లో ఉండేది మరి.
రఘువరన్ నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో మధ్య వయసులోనే అనారోగ్యం కారణంగా మరణించి ఈ లోకానికి..చిత్రపరిశ్రమకు దూరం అయ్యారు. అయితే రఘువరన్ సినిమా జీవితం గురించి చాలామందికి తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. రఘువరన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన ఒకప్పటి హీరోయిన్ రోహిణిని పెళ్లి చేసుకున్నారు. రోహిణి ఏపీలోని అనకాపల్లికి చెందిన వారే కావడం విశేషం. తండ్రి ప్రోత్సాహంతో రోహిణి సినిమాల్లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు.
రోహిణి దాదాపు 30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు తమిళ మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. ఆమె ముందు నటిగానే కెరీర్ స్టార్ట్ చేసినా ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి ఎంతోమంది హీరోయిన్లకు, ఎన్నో సినిమాల్లో తన గాత్రం అందించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రోహిణి నటుడు రఘువరన్ ను పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లపాటు వీరిద్దరి వైవాహిక జీవితం హ్యాపీగానే సాగింది. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
రోహిణి, రఘువరన్‌తో విడాకులు తీసుకోవడం వెనక రఘువరన్ విపరీతమైన మద్యం, మత్తుపదార్థాలకు బానిస కావడమే కారణమని అంటారు. రోహిణి తన భర్తను మార్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎన్నోసార్లు చెప్పి చూసింది. చివరకు రఘువరన్ తన చెడు వ్యసనాల వల్ల కెరీర్ పరంగా కూడా దెబ్బతిన్నాడు. చివరకు అది విడాకులకు కారణమైంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రోహిణి 2004 సంవత్సరంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విరుమండి అనే తమిళ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత గ్యాప్ లేకుండా రోహిణి సినిమాలు చేస్తున్నారు. తల్లి అత్త మరియు ఇతర ముఖ్యమైన పాత్రలో నటిస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. బాహుబలి మొదటి పార్ట్ లో ప్రభాస్ తల్లిగా నటించి రోహిణి తన నటనతో మెప్పించారు. రోహిణి – రఘువరన్ కొడుకు రిషి ప్రస్తుతం చదువుతున్నాడు. రఘువరన్ చనిపోయినా తన అత్త, మామల కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని రోషిణి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.