టాలీవుడ్ లో మూడున్నర దశాబ్దాల క్రితం విజయశాంతి, రాధ స్టార్ హీరోయిన్ లుగా ఒక వెలుగు వెలిగారు. వీరిద్దరూ అప్పటి స్టార్ హీరోలతో పోటీపడి మరి నటించేవారు. విజయశాంతి నటనపరంగా టాప్ ప్లేస్ లో ఉంటే రాధ డ్యాన్సుల్లో హీరోలతో పోటీపడి మరి స్టెప్పులు వేసి కుమ్మేసేది. అలా ఇద్దరు ఒకరికొకరు పోటీపడి మరి సినిమాలు చేసేవారు. ముఖ్యంగా అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవితో రాధా, విజయశాంతి ఎక్కువ సినిమాలు చేశారు.
చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ సినిమా వచ్చిన వెంటనే.. రాధా – చిరు కాంబినేషన్లో మరో హిట్ సినిమా వచ్చేసేది. అప్పట్లో మాస్ జనాలు చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ తెరమీద చూసేందుకు ఎంతో ఇష్టపడేవారు. రాధా – చిరంజీవి కాంబినేషన్ సినిమాలు కూడా అలాగే ఎంజాయ్ చేసేవారు. చిరంజీవితో విజయశాంతి, రాధ ఇద్దరు సూపర్ హిట్ సినిమాలు ఇస్తుండడంతో దర్శక, నిర్మాతలు సైతం చిరంజీవితో సినిమా తీసేటప్పుడు.. ఈ ఇద్దరు హీరోయిన్ల డేట్ ల కోసం వెంటపడేవారట.
అయితే ఒక్కోసారి విజయశాంతి డేట్లు ఖాళీ లేకపోతే రాధను హీరోయిన్గా తీసుకోవడం… రాధ బిజీగా ఉంటే విజయశాంతిని తీసుకోవటం జరిగేదట. ఈ క్రమంలోనే విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్‌వార్ కూడా జరిగేదట. ముఖ్యంగా చిరంజీవి సినిమాల విషయంలో విజయశాంతి, రాధ మధ్య మాటలు కూడా ఉండేవి కాదని టాలీవుడ్ లో టాక్ ఉండేది.
విచిత్రం ఏంటంటే చిరుకు జోడిగా ఈ ఇద్దరు కలిసి కూడా సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే కాలక్రమంలో విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ఆమె కెరీర్ ఎక్కువ కాలం కొనసాగగా టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ అయిపోయారు. రాధ ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయ్యింది. ఏదేమైనా అప్పట్లో విజయశాంతి. రాధ మధ్య జరిగిన కోల్డ్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉండేది.