చెన్నై చిన్నది త్రిష దాదాపు రెండు దశాబ్దాల నుండి సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతోంది. త్రిషకు ఆమె సొంత భాష తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువగా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ఆమె దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలాగే సీనియర్ హీరోల పక్కన జోడిగా నటించింది. త్రిష కు తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు పడ్డాయి. అటు తమిళం ఇండస్ట్రీలోనూ పదేళ్ల పాటు తిరుగులేని హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
ఒకానొక సమయంలో సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ హోదా కోసం నయనతార, త్రిష గట్టిగా పోటీ పడ్డారు. అయితే ఈ పోరులో చివరకు నయనతారదే పైచేయి అయింది. తెలుగులో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన `వర్షం` సినిమాతో త్రిషకు స్టార్డం దక్కింది. శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో త్రిష అందచందాలకు తెలుగు యువత ఫిదా అయిపోయారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన వెంటనే ఆమెకు తెలుగులో ఒక్కసారిగా పెద్ద హీరోలు, పెద్ద దర్శకుల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
అయితే త్రిష వర్షం సినిమా నిర్మాత ఎంఎస్ రాజు కు డైరీ ఇచ్చి `అంకుల్ మీకు ఏ డేట్లు కావాలో రాసుకోండి` అని బంపర్ ఆఫర్ ఇచ్చిందంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. వర్షం సినిమా సమయం నుంచి త్రిష తమ ఇంట్లో అమ్మాయిగా కలిసిపోయిందని, ఆ చనువుతోనే తనకు డైరీ ఇచ్చి మీకు కావాల్సినన్ని డేట్ లు తీసుకోమని ఆఫర్ ఇచ్చిందని ఎంఎస్ రాజు తెలిపారు. ఆ తర్వాత ఎంఎస్ రాజు బ్యానర్లోనే ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన `నువ్వు వస్తానంటే నేనొద్దంటానా `సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా నటించింది.
అలా ఎంఎస్ రాజు బ్యానర్ లో త్రిష వరుసగా రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నుంచి ఆమె టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. పది ఏళ్లకు పైగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. స్టార్ హీరోలు లేదు, కుర్ర హీరోలు లేదు.. అందరితోనూ నటించి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్మెంట్ జరిగి బ్రేకప్ అయినా కూడా త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది. ఇప్పుడీమె తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ హీరోయిన్ గా మారింది.