యస్ టాలీవుడ్ లో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి సినిమా కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే గత కొన్ని నెలలుగా ప్రభాస్ మారుతి కాంబోలో సినిమా రాబోతుందని అది ఫుల్ కామెడీగా ఉంటుందని సినీ వర్గాలలో తెగ హల్చల్ చేస్తుంది. కాగా ఆ వార్తలను నిజం పోస్తూ ఈ మధ్యనే మారుతి ప్రభాస్ సినిమా పూజా కార్యక్రమాలు ఎవ్వరికి తెలియకుండా జరుపుకున్నారు అంటూ మరో వార్త వైరల్ గా మారింది.
అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేనప్పటికీ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ పనులన్నీ పూర్తి అయినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని వాళ్ళల్లో ఒకరు మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్.. మరొకరు మారుతీ లక్కీ హీరోయిన్ మెహ్రీన్. మరొకరు యంగ్ బ్యూటీ కృతి శెట్టి కానీ శ్రీలీలను కానీ తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ అద్భుతమైన రోల్ లో కనిపించబోతున్నాడట. ఇప్పటివరకు మనం ప్రభాస్ ని ఇలాంటి యాంగిల్ లో చూసి ఉండబోమని సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది.
కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 50 రోజుల కాల్ షీట్లు ఇచ్చారని ఆ కాల్ షీట్ల టైంలోనే మొత్తం ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకునేలా ప్రభాస్ ఒక కండిషన్ పెట్టాడని న్యూస్ వైరల్ అయింది. కానీ తాజాగా సమాచారం ప్రకారం సినిమా కథలో కొన్ని మార్పులు కారణంగా ప్రభాస్ నుండి మరో 15 రోజులు ఎక్స్ట్రా కాల్ షీట్లు.. అడిగారని దీనికి కూడా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓకే చెప్పారని.. అంతే కాదు ఈ 15 రోజులకు రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఆయన ఈ సినిమా షూటింగ్ కి ఓకే చెప్పారని తెలుస్తుంది . నిజానికి ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమా అంటే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం . అలాంటిది 15 రోజులు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేయడం అంటే మాటలు కాదు అలాంటి సాహసం చేస్తున్న హీరో మన ప్రభాస్ అనే చెప్పాలి..!!