Moviesఆ సినిమా చేయద్దు అంటూ అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్..రిజల్ట్ చూసి...

ఆ సినిమా చేయద్దు అంటూ అనుష్కకు వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్..రిజల్ట్ చూసి స్వీటీ షాక్..!?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్టార్ హీరోస్-డైరెక్టర్, హీరోయిన్స్-హీరోస్, ప్రొడ్యూసర్స్-హీరోయిన్స్, డైరెక్టర్స్-హీరోయిన్స్.. ఇలా బోలెడు మంది ఉన్నారు. వాళ్ళల్లో అందరికీ నచ్చిన మెచ్చిన జంట అనుష్క-ప్రభాస్. వీరిద్దరూ ఫ్రెండ్స్ న..? లవర్సా నా..? కాబోయే భార్య భర్తల..? ఎవ్వరికి తెలియదు. వాళ్లని అడిగితే మాత్రం కచ్చితంగా మేము ఫ్రెండ్స్ అని అంటారు. కానీ వాళ్ళ ప్రవర్తించే తీరు మాత్రం లవర్స్ అనే చెప్పాలి. అంతే కాదు వీళ్లు ఫ్రెండ్స్ గా కన్నా లవర్స్ గా ఉంటేనే బాగుంటుంది.. పెళ్లి చేసుకుని ఒకటవ్వాలి అని వీళ్ళిద్దరిని ప్రేమించే అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తారో వీరు దానికోసం వెయిట్ చేయాల్సిందే..!!

కాగా అనుష్క ప్రభాస్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా అంటే వాళ్ళ స్క్రిప్ట్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు . జనరల్ గా హీరో హీరోయిన్స్ కమర్షియల్ గానే ఉంటారు. ఈవెంట్స్ కు వెళ్లిన వాళ్ల సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళిన అలానే బిహేవ్ చేస్తారు. కానీ అనుష్క ప్రభాస్ మాత్రం చాలా హుందాగా బిహేవ్ చేస్తారు . ప్రొడ్యూసర్ తో కానీ డైరెక్టర్లతో కానీ వాళ్ళ సినిమాకు సంబంధించి ఏ ఇబ్బందులకు గురి చేయరు. అలా ఉంటారు. కాగా ప్రభాస్ అనుష్కకు చాలా సినిమాల్లో స్క్రిప్ట్ విషయంలో హెల్ప్ చేశారని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. ఈ క్రమంలోనే అనుష్క ఒక సినిమా స్క్రిప్ట్ గురించి చెప్పగా ప్రభాస్ నో అంటు రిజెక్ట్ చేశారట. కానీ అనుష్కకు నచ్చడంతో ఆమె సైన్ చేసి సినిమాలో నటించారు. అఫ్ కోర్స్ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా మరేదో కాదు “వేదం”.

క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కిన వేదం సినిమాలో అనుష్క ఓ వ్యభిచారిగా నటించింది. ఈ సినిమాలో అనుష్క ప్రవర్తన తీరు నటన చూసి జనాలు షాక్ అయిపోయారు. అప్పటివరకు స్టార్ హీరోయిన్స్ స్టేటస్ కలిగిన అనుష్క.. ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా ఇలాంటి పాత్రల్లో కనిపించడం. ఆమెకు కొంచెం మైనస్ అవుతుంది అని అంతా భావించారు. ఇదే క్రమంలో ప్రభాస్ కూడా స్క్రిప్ట్ రిజెక్ట్ చేయమని చెప్పారట. కానీ అనుష్క మాత్రం కథ నచ్చడంతో ముందుకెళ్ళింది. ఆఫ్ కోర్స్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. కానీ అనుష్క నటనకు మాత్రం మంచి పేరు దక్కింది. ఆమెను ఎవరు వ్యభిచారిగా చూడలేదు. ఆ పాత్రలో వాళ్ళు పడిన బాధను మనకు తెలియజేసే అమ్మాయిలానే చూసారు. ఆ పాత్ర చూసిన 60 ఏళ్ల ముసలావిడ “హగ్ చేసుకుని బాగా చేశావమ్మా” అంటూ పొగిడేసరని ఆ సందర్భాన్ని అనుష్క ఇప్పటికీ మర్చిపోలేను ఇంటర్వ్యూలో చెప్పుకురావటం గమనార్హం. కాగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమాతో బిజీగా ఉంది. మరి చూడాలి ఈ ఇద్దరు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news