భారీ తారాగణంతో పాటు సీనియర్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్. చోళరాజుల చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ బాహుబలి అంటూ ముందునుంచి ప్రచారం ఊదరగొట్టేశారు. దీనికి తోడు గత కొంత కాలంగా వరుస ప్లాపులతో ఉన్న మణిరత్నం ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తాడని కొందరు ఆశలు పెట్టుకున్నారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్లు కూడా కంప్లీట్ చేసుకుంది. మరి సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం.
ఈ సినిమా ఫస్టాఫ్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుతుంది. ఫస్టాఫ్ అసలు ఏ మాత్రం ఆకట్టుకునేలా ఉండదు. ఫస్టాఫ్‌లో కార్తీకి ఎక్కువ స్పేస్ ఉంది. విక్రమ్‌పై దర్శకుడు సరైన కాన్సంట్రేషనే చేయలేదు అనిపిస్తుంది. ఐశ్వర్యారాయ్, త్రిష చూడడానికి బాగున్నారు. ఏఆర్. రెహ్మన్ సంగీతం జస్ట్ ఓకే. ఇక సెకండాఫ్‌లో లంకపై జయం రవి యుద్ధ సన్నివేశాలు, త్రిష, ఐశ్వర్యారాయ్ కలుసుకునే ఒకటి రెండు సీన్లు మాత్రమే బాగున్నాయి.
ఓవరాల్‌గా చూస్తే పొన్నియిన్ సెల్వన్-1 ఫ్లాట్ మరియు ఉద్వేగభరితమైన కథనం. అసలు ఇందులో ఎలాంటి ఎమెషనల్ కనెక్టివిటి కనపడదు. ఈ కథా పుస్తకాన్ని చదవని వారికి అసలు ఈ కథ, పాత్రలు, కథనం అర్థం చేసుకోవడం కష్టం. సినిమా అంతా గందరగోళంగా అనిపిస్తుంది. తమిళ ప్రేక్షకులు.. అందులోనూ చరిత్రను బాగా ఇష్టపడే వారు. ఈ సినిమాలో ఉన్న హీరోల అభిమానుల్లోనే ఈ సినిమా చాలా మందికి నచ్చదు.
ఇక తమిళేతేర ప్రేక్షకులకు PS-1 ఏ మాత్రం కనెక్ట్ కాదు. ఫస్ట్ పార్టే ఇలా ఉందంటే… ఇక సెకండ్ పార్ట్ ఇంకెలా ఉంటుందో ? అన్న సందేహం రాకమానదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు, వార్ సన్నివేశాలు మినహా ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. వీఎఫ్ఎక్స్ చాలా వీక్‌గా ఉంది. అసలు ఇలాంటి సినిమాకు యాక్షన్ సీన్లే కీలకం… అవి చాలా నాసిరకంగా ఉన్నాయి. ఇక మణిరత్నం మరోసారి బూజుపట్టిపోయిన కాలం నాటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఫస్టాఫ్ పూర్తయ్యే సరికే తలపొటు రావడం ఖాయం.