టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. అంతకుముందే ఆమె కోలీవుడ్‌లో ఓ సినిమాలో హీరోయిన్గా నటించింది. తెలుగులో మాత్రం బద్రి ఆమెకు మొదటి సినిమా. బద్రి తర్వాత పవన్ కళ్యాణ్ ప్రేమలో పడిపోయిన రేణు పవన్‌తోనే సహజీవనం చేస్తూ వచ్చింది. అప్పటికే మొదటి భార్యకు దూరంగా ఉంటున్న పవన్ రేణుతో సీక్రెట్‌గా ప్రేమాయణం నడుపుతూ వచ్చాడు. 2003లో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలోను రేణుయే హీరోయిన్గా నటించింది. రేణుకు హీరోయిన్గా అదే చివరి చిత్రం. ఆ తర్వాత ఆమె మళ్ళీ వెండితెరపై కనిపించలేదు.
పవన్ కళ్యాణ్ తో పెళ్లి ఇద్దరు పిల్లలు… తర్వాత విడాకులు ఇలా రేణు దేశాయ్ జీవితం ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఆమె సినిమాల వైపు చూడలేదు. రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చేశాక పవన్ తీన్మార్ సినిమాలో నటించిన రష్యన్ మోడల్ అన్న లెజ్నోవాను మూడో భార్యగా స్వీకరించారు. పవన్ రేణుకు విడాకులు ఇచ్చేసినా రేణుతో తనకు కలిగిన ఇద్దరు పిల్లల కెరీర్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. పవన్ కు విడాకులు ఇచ్చేశాక రేణు ప్రస్తుతం పూణేలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.
విడాకులు తర్వాత కూడా పవన్ – రేణు పిల్లల కోసం చాలాసార్లు కలుస్తున్నారు. పవన్ కూడా అప్పుడప్పుడు పూణేకు వెళ్లి వస్తూ ఉంటారు. విడాకుల తర్వాత కూడా పవన్ రేణుతో సన్నిహితంగా ఉండటం వల్లే మూడో భార్యతో కాస్త గ్యాప్ వచ్చిందన్న గుసగుసలు కూడా తాజాగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు రేణు 18 ఏళ్ల తర్వాత మాస్ మహరాజ్ రవితేజ నటిస్తోన్న సినిమాతో వెండితెరపై.. అందులోనూ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్నాడు. 1970ల్లో బాపట్ల జిల్లాలోని టైగర్ నాగేశ్వరరావు అనే స్టూవర్ట్‌పురం దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రేణు ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండడంతో పవన్ అభిమానుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ సరికొత్త చర్చ నడుస్తోంది. పవన్ – రేణు మళ్లీ దగ్గరయ్యే ఛాన్సులు ఉన్నాయని… పవన్ మదిలో తమ వదిన రేణు జ్ఞాపకాలు మళ్లీ మొదలవుతాయని పవన్ అభిమానులే చర్చించుకుంటున్నారు.
చాలా మంది పవన్ అభిమానులకు ఇప్పటకీ రేణు అంటే ఇష్టం. రేణు మళ్లీ పవన్ జీవితంలోకి రావాలనే కోరుకుంటూ ఉంటారు. మరి రేణు రీ ఎంట్రీతో తెలుగులో సక్సెస్ అయితే పవన్ – రేణు సంబంధాలు ఎలా ఉంటాయి ? ఆకీరా హీరో అవుతాడా ? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.