పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఆ పేరులోనే ఏదో తెలియని ఫీలింగ్ ఉంది. ఆ పేరు పలుకుతుంటేనే వైబ్రేషన్స్.. వింటూ ఉంటేనే పూనకాలు.. అబ్బో పవన్ గురించి చెప్పేంత స్థాయి ఎవరికీ లేదనే చెప్పాలి. ప్రజెంట్ అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీగా తన కెరీర్ ని ముందుకు తీసుకుపోతున్న ఈ హీరో.. చేతిలో నాలుగు సినిమాలను పెట్టుకొని టాప్ హీరోల లిస్టులో కొనసాగుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ లాస్ట్ గా నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది .
మలయాళ సినిమాకి రీమిక్స్ అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తనదైన స్టైల్ లో ఈ సినిమాకి మాటలను అందించి డైలాగ్స్ పొలిటికల్ గా పేలేలా రాసుకొని పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు. థియేటర్స్ లో పవన్ డైలాగ్స్ చెప్తుంటే జనాలు రేంజ్ లో ఊగిపోయారు. ఆ విజువల్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గానే ఉన్నాయి. కాగా ఈ సినిమాలో మలయాళ బ్యూటీలు సంయుక్తా మీనన్, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. సంయుక్తమీనన్ ఈ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. సో అమ్మడికి పెద్దగా నటించే స్కోప్ లేకుండా పోయింది. కానీ నిత్యామీనన్ స్టార్ హీరోయిన్ ఇప్పటికే చాలా సినిమాలతో తన రేంజ్ ని పెంచేసుకుంది.
మరి అలాంటి హీరోయిన్ కి ఈ సినిమాలో తక్కువ స్థానం కల్పించడం అప్పట్లో వైరల్ గా మారింది. ఇదే విషయంపై నిత్యామీనన్ కూడా ఫైర్ అవుతూ .. తనకు స్టోరీ చెప్పే ముందు ఒకలా చెప్పారని.. డైరెక్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ సీన్స్ రాసారని.. కానీ ఎడిటింగ్ లో మాత్రం తనది చాలా సీన్స్ లేపేసారని.. అందుకే ఆమె ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కోప్పడి రాలేదంటూ అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది.
అయితే పవన్ కళ్యాణ్ ఇష్యూ పై ఇప్పటివరకు స్పందించకపోయినా రీసెంట్ గా తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నిత్యామీనన్ కి ఓ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్లు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఒకవేళ అదే నిజమైతే కచ్చితంగా తెరపై పవన్ కళ్యాణ్ నిత్యామీనన్ జంట మరోసారి ఎక్కువ మార్కులు సంపాదించుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు అభిమానులు.