MoviesTL రివ్యూ: ఒకే ఒక జీవితం

TL రివ్యూ: ఒకే ఒక జీవితం

టైటిల్‌: ఒకే ఒక జీవితం
నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ఆలీ, మధు నందన్ తదితరులు.
మ్యూజిక్‌: జెక్స్ బిజోయ్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు
దర్శకత్వం : శ్రీ కార్తీక్
రిలీజ్ డేట్‌: 09, సెప్టెంబ‌ర్ 2022

యంగ్ హీరో శ‌ర్వానంద్‌కు గ‌త కొంత కాలంగా త‌న రేంజ్‌కు త‌గ్గ హిట్ అయితే ప‌డ‌డం లేదు. తాజాగా ఒకే ఒక జీవితంతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. సీనియ‌ర్ న‌టిమ‌ణి అమ‌ల కూడా న‌టించ‌డంతో పాటు ముందే వేసిన ప్రివ్యూల‌తో సినిమాకు పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. మ‌రి ఈ సినిమాతో అయినా శ‌ర్వానంద్ హిట్ కొట్టాడా ? లేదా ? అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), మరియు చైతు (ప్రియదర్శి) ముగ్గురు చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. వీరు ముగ్గురికి ఎవ‌రి స‌మ‌స్య‌లు వారికి ఉంటాయి. ఈ టైంలో వారి జీవితాల్లోకి ఓ సైంటిస్ట్ ( నాజ‌ర్‌) ఎంట్రీ ఇస్తాడు. అత‌డు క‌నిపెట్టిన టైం మిష‌న్‌తో ఈ ముగ్గురు త‌మ గ‌తంలోకి వెళ్లి ప్ర‌స్తుత భ‌విష్య‌త్తును గొప్ప‌గా మార్చుకోవాల‌ని అనుకుంటారు. అయితే ఆది మాత్రం చ‌నిపోయిన త‌న త‌ల్లి ప్రాణాలు కాపాడాల‌ని కోరుకుంటాడు. ఈ క్ర‌మంలో వీరు ముగ్గురు జ‌ర్నీ ఎలా సాగింది ? చివ‌ర‌కు వారి జీవితాలు ఎలా ? ట‌ర్న్ అయ్యాయ‌న్న‌దే స్టోరీ.

విశ్లేష‌ణ :
ఎమోష‌న‌ల్‌గా సాగిన ఈ సినిమాలో చాలా అంద‌మైన ఎమోష‌న‌ల్ సీన్లు ఉన్నాయి. అమ్మ ప్రేమ‌కు సంబంధించి వ‌చ్చే సీన్లు మ‌న‌స్సును ట‌చ్ చేస్తాయి. సినిమాలో సెంటిమెంట్‌, ఎమోష‌న‌ల్ సీన్లే కాదు… నావెల్టీ కూడా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు ఇది చాలా కొత్త పాయింట్‌. శ‌ర్వానంద్ ఈ సినిమాలో కథానుసారం త‌న పాత్ర‌లు, ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా మెప్పించాడు. త‌న బాడీ లాంగ్వేజ్‌తో పాటు ఫీల్ గుడ్‌, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మెప్పించాడు. ఇక త‌ల్లి పాత్ర‌లో న‌టించిన అమ‌ల న‌ట‌న‌తో పాటు త‌న న‌వ్వుతో మెప్పించింది.

చాలా రోజుల త‌ర్వాత తెర‌పై క‌నిపించిన అమ‌ల‌కు మంచి పాత్రే ప‌డింది. ఇక హీరోయిన్ రీతూవ‌ర్మ పాత్ర‌కు పెద్ద స్కోప్ లేదు. అయితే సినిమాలో మెయిన్ హైలెట్ కామెడీ అని చెప్పాలి. ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్ తమ కామెడీ టైమింగ్‌తో సినిమా లెవ‌ల్ పెంచేశారు. నాజ‌ర్ న‌ట‌న చాలా నేచుర‌ల్‌గా ఉంది. ఈ సినిమా టైమ్ మిష‌న్ క‌థే అయినా ఆదిత్య 369తో ఎక్క‌డా పోలిక ఉండ‌దు. దీనికంటూ స‌ప‌రేట్ మార్క్ ద‌క్కించుకుంది.

ఇది అమ్మ క‌థ‌. ఇర‌వై సంవ‌త్స‌రాలుగా తాను కోల్పోయిన అమ్మ‌ను తాను మ‌ళ్లీ ఓ సారి చూసుకుని రావ‌డం… త‌న ధైర్యాన్ని మ‌ళ్లీ తెచ్చుకోవ‌డం.. ఇంత‌కు మించిన గొప్ప ఎమోష‌న‌ల్ ట‌చ్ ఏం ? ఉంటుంది. అమ్మ ఎమోష‌న‌తో టైం మిష‌న్ ముడి పెట్ట‌డం ద‌ర్శ‌కుడి తెలివైన డెసిష‌న్‌కు హ్యాట్సాప్‌. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో కూడా 30 ఏళ్ల వ‌య‌స్సు ఉన్నోళ్లు 10 ఏళ్ల అప్పుడు తాము ఎలా ? ఉన్నామో చూసుకునే క్ర‌మంలో ట్విస్టింగుగా ఉంటుంది. టైమ్ మిష‌న్ క‌థ‌కు ద‌ర్శ‌కుడు భూత‌, భ‌విష్య‌త్తు, వ‌ర్త‌మాన కాలాలు క‌వ‌ర్ చేయ‌డం బాగుంది.

ద‌ర్శ‌కుడు శ్రీ కార్తీక్ రాసుకున్న స్టోరీ లైన్‌, ఎమోష‌న‌ల్ సీక్వెన్సే సినిమాకు హైలెట్‌. ఇక చివ‌ర్లో ఎమోష‌న‌ల్ ఎలిమెంట్స్‌తో సినిమాకు ముగింపు ఇవ్వ‌డం బాగుంది. శ‌ర్వా మంచి న‌టుడే కాని ఈ సినిమా అత‌డి కెరీర్‌ను ఖ‌చ్చితంగా మ‌రో మెట్టు ఎక్కించేంత గొప్ప‌గా ఒదిగిపోయాడు.

టైమ్ మిష‌న్ క‌థలో ఒక‌టి రెండు లాజిక్‌లు మిస్ అవ్వ‌డం కామ‌న్‌. ద‌ర్శ‌కుడు త‌న త‌ల్లిని కోల్పోయాక ఆ బాధ‌లో రాసిన క‌థ ఇది అని చెప్పాడు. అస‌లు ఈ లైనో చాలా మంచిది అనుకుంటే.. దానిని ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ చేసేలా చెప్ప‌డం ఇంకా అద్భుతం. అయితే సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది. అలాగే స్లో నెరేష‌న్ కంప్లైట్, ప‌క్కా మాస్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కాకపోవ‌డం లాంటి కంప్లైంట్లు మిన‌హాయిస్తే సినిమా సూప‌ర్‌. టెక్నిక‌ల్‌గా అన్ని విభాగాలు బాగా ప‌నిచేశాయి.

ఫైన‌ల్‌గా…
ఒకే ఒక జీవితం థియేట‌ర్ల‌లో ఓ సారి హాయిగా చూడొచ్చు. శ‌ర్వానంద్ ఎటెంప్ట్ చేసిన మంచి క్యారెక్ట‌ర్ల‌లో ఒక్క‌టిగా ఈ సినిమా మిగిలిపోతుంది. క్లాస్‌ను మెప్పించే ఈ సినిమా మాస్‌ను అంత‌గా మెప్పించ‌క‌పోవ‌చ్చు.

ఒకే ఒక జీవితం రేటింగ్‌: 3 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news