అన్నగారి సినిమాల్లో అత్యంత హిట్ కొట్టిన సినిమా.. అంటే.. తొలితరం జానపద చిత్రాల్లో సంగతన్నమాట.. పాతాళభైరవి. ఈ సినిమా ఒక కళాఖండం. దీనిలో అనేక మంది నటులు నటించారు. ఎస్వీరంగారావు మాయావి పాత్రను పోషించారు. ఈ సినిమాలో అనేక అద్భుత ఘట్టాలు కూడా ఉన్నాయి. కేవలం.. అన్నగారి కోసమే కాదు.. అనేక మంది పాత్రలు కూడా దీనిలో ప్రముఖంగా మనకు కనిపిస్తాయి. రేలంగిని కూడా .. విలన్‌గా చూపించిన సినిమా ఇది.
అలాంటి సినిమా విడుదల తర్వాత.. అన్నగారికి వివాదం ఏర్పడింది. ఆయన ఈ సినిమా కోసం.. కర్రసాము ప్రత్యేకంగా నేర్చుకు న్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక కుస్తీ వస్తాదు వద్ద.. కుస్తీలు కూడా నేర్చుకున్నారు. అయితే.. కుస్తీ.. సీన్లు చాలా చోట కనిపించినా.. కర్రసాము మాత్రం.. కేవలం ఒకే ఒక్కసీన్‌లో ఉంటాయి. అంజితో చేసే కర్రసాము ఒక్కటే పరిమితం. అయితే.. అన్నగారు కర్రసామును దాదాపు రెండు నెలలపాటు అభ్యాసం చేశారు. ఉదయాన్నే స్టూడియోకు రావడం.. కర్రసాము ప్రాక్టీస్ చేయడం.. అన్నగారి విధుల్లో భాగం అయిపోయింది.
ఈ కర్రసాము చేసే సమయంలో ఒకసారి అన్నగారికి నడుం కూడా పట్టేసి.. రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. మరి అంతగా కష్టపడి నేర్చుకున్న కర్రసాము సీన్ సినిమాలో కనీసం. ఓ ఐదు నిమిషాలలైనా ఉంటుందని అన్నగారు ఆశించారు. అంతేకాదు.. వరుస మూడు సీన్లలో ఈ కర్రసామును షూట్ చేశారు. కానీ.. తీరా.. సినిమా ఎడిట్ అయి.. తెరమీదికి వచ్చే సరికి.. ఒకే ఒక్క చోట కర్రసాము సీన్ కనిపించింది.
దీంతో అన్నగారికి.. చిర్రెత్తు కొచ్చి డైరెక్టర్‌పై ఫైర్ అయ్యారట. అదేంటి సార్.. అంత కష్టపడితే.. రెండు నిముషాల్లో తేల్చేశారు.. అని ప్రశ్నించారట. దీనికి డైరెక్టర్.. సినిమా కదా! అని సమాధానం ఇచ్చారట. దీంతో ఇక, ఆ తర్వాత.. అన్నగారు.. ఏ సినిమాలో నూ కర్రసాము సీన్ చేయలేదట.