సినీ ఇండస్ట్రీలో డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు చాలా కామన్. ఈ మధ్యకాలంలో విడాకులు కూడా కామన్ అయిపోయాయి లేండి. అది వేరే మ్యాటర్ ఒకే సినిమా షూటింగ్ టైంలో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కుదిరితే కాపురం చేయడం.. కుదరకపోతే విడాకులు తీసుకోవడం.. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా కొనసాగుతుంది. కేవలం హీరో హీరోయిన్స్ ఏ కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, డైరెక్టర్లు ,హీరోయిన్లు కూడా ..ఇలానే చేస్తున్నారు.
కాగా ఆ లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతుంది యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్. ఈ బ్యూటీ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ తెలుగు సినిమాల్లోనూ అలరించిన ఈ బ్యూటీ అంటే జనాలకు ఇష్టమే. మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించిన నివేతా పేతురాజ్.. 2016లో తమిళ్ చిత్రంతో హీరోయిన్గా మారింది. అంతేకాదు తమిళ్ లో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూనే నివేతా పేతురాజ్.. తెలుగులో హీరోయిన్గా ట్రై చేసింది.
ఆమె తెలుగులో నటించిన మొదటి చిత్రం “మెంటల్ మదిలో”.. ఈ సినిమాలో నివేత పర్ఫామెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి.ఈ సినిమా హిట్ కాకపోయినా ఆమె నటన మెప్పించగలిగింది జనాలని. ఇక ఆ తర్వాత నివేత గ్లామర్ పాత్రలతో పాటు ఛాలెంజింగ్ పాత్రల్లో కూడా నటిస్తూ మెప్పించింది. కాగా ఈ క్రమంలోనే ఆమె నటించిన హీరోతో ప్రేమలో పడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .
నివేత పేతురాజ్ తెలుగు బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోతో ఓ సినిమాలో కలిసి నటించారు. ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సినిమా రిలీజ్ అయి చాలా సంవత్సరాలు అవుతున్నా కానీ వీళ్ళ ప్రేమ ఇంకా బయటపడలేదని ..గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తున్నారని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అన్ని కుదిరితే సవ్యంగా జరిగితే నివేతా పేతురాజ్ బడా ఫ్యామిలీకి కోడలుగా మారబోతుంది అంటున్నారు సినీ వర్గాలు. మరి చూడాలి వీళ్ళ ప్రేమ బయట ఎప్పుడు పడుతుందో ..పెద్దలు ఎప్పుడు ఒప్పుకుంటారో.. ఆ న్యూస్ మనకు ఎప్పుడు చెప్తారో..?