నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మలినేని గోపీతో బాలయ్య నటిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. అటు గోపీచంద్ కూడా రవితేజతో తీసిన క్రాక్ సూపర్ హిట్ కావడంతో ఎన్బీకే 107 కూడా బ్లాక్భస్టరే అవుతుందనే ట్రేడ్ వర్గాలు, ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఎక్కువుగా ఉంది.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ బాలయ్యను ఢీ కొట్టే పాత్రలో కనిపిస్తున్నాడు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, స్టిల్స్ అయితే సినిమాపై అంచనాలు మామూలుగా పెంచడం లేదు.
ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యిందని.. అన్ని ఏరియాల్లోనూ బాలయ్య గత సినిమాల కంటే టాప్ రేట్లకే అమ్ముడవుతోందట. అఖండను ఓవరాల్‌గా రు. 60 కోట్ల రేషియోలో అమ్మితే ఆ సినిమా ఏకంగా ఎవ్వరూ ఊహించని విధంగా థియేట్రికల్ షేరే రు. 150 కోట్లు కొల్లగొట్టింది. పైగా అప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా తక్కువుగా ఉన్నాయి. బెనిఫిట్ షోలు కూడా లేవు.
ఇక ఇప్పుడు ఎన్బీకే 107కు అన్ని ఏరియాల నుంచి భారీ ఎత్తున అడ్వాన్స్‌లతో పాటు ప్రి రిలీజ్ బిజినెస్ డీల్స్ అయితే గట్టిగానే నడుస్తున్నట్టు టాక్ ? కేవలం ఏపీ, తెలంగాణ వరకే ఈ సినిమా రు. 80 కోట్లకు కాస్త అటూ ఇటూగా బిజినెస్ చేయబోతోందని తెలుస్తోంది. ఇది బాలయ్య కెరీర్లోనే హయ్యస్ట్. అఖండ రేంజ్లో హిట్ టాక్ వస్తే రు. 80 కోట్ల షేర్ రాబట్టడం బాలయ్యకు పెద్ద కష్టమేం కాదు.
పైగా అటు హీరోతో పాటు డైరెక్టర్ ఇద్దరూ హిట్టు కొట్టి ఫామ్‌లో ఉన్నారు. శృతి లాంటి అందాల బొమ్మతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి కీలక నటీమణులు కూడా ఉండడంతో సినిమా బిజినెస్ డీల్స్ అయితే దుమ్ము రేపుతున్నాయి. ఇక సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ వస్తే సినిమా హైప్ మామూలుగా ఉండేలా లేదు.