అక్కినేని నాగార్జున.. సినీ ఇండస్ట్రీలో ఈ కింగ్ కి ఉన్న ప్రత్యేక పేరు గురించి, క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ తన లుక్స్ తో తన అందంతో స్టార్ హీరోల భార్యలకు కూడా ఫేవరెట్ హీరోగా మారిన స్టార్ హీరో నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ యంగ్ లుక్స్ లో కొడుకులకే పోటీ ఇస్తూ.. యంగ్ హీరోలకి కూడా తనదైన స్టైల్ లో ధీటుగా సమాధానం ఇస్తున్నాడు.
సినిమాల పరంగా ఎలా ఉన్నా నాగార్జున వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు నెట్టింట ట్రోల్ అవుతూనే ఉంటారు. దానికి కారణం ఒకటే ఒకటి . ఆయన రెండో పెళ్లి. మనకు తెలిసిందే నాగార్జున దగ్గుబాటి ఆడపడుచును పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చాక కొన్ని కారణాల చేత ఆమెకు డివోర్స్ ఇచ్చి అమలాతో ప్రేమలో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అఖిల్ కు జన్మనిచ్చాడు . కానీ ఏనాడు నాగచైతన్యను తన మొదటి భార్యకు దూరం పెట్టలేదు. ఆ కుటుంబంతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు తీసుకొచ్చారు.
కాగా నాగార్జునకు అమల అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పటికీ అన్యోన్యంగా చూడ చక్కగా మిగతా దంపతులకు ఆదర్శంగా నిలుస్తుంది . అయితే పెళ్లయిన కొత్తలో అమల నాగార్జునకు ఓ మాట చెప్పిందట . ఆ పని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అంటూ ప్రామిస్ చేయించుకుందట. ఆశ్చర్యం ఏంటంటే పెళ్లి అయ్యి ఇన్నాళ్లయినా కూడా నాగార్జున ఇప్పటికీ ఆ పని కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడట . ఇంతకీ ఆ పని ఏంటో తెలుసా ..?
మనకు తెలిసిందే అమల జంతు ప్రేమికురాలు జంతువులకు ఏదైనా అయితే అమలు చూసి తట్టుకోలేదు. ఈ కారణంగా అమల తన సంపాదనలో కొంచెం జంతువుల సంరక్షణ కోసం ఇస్తుందట. అదే విధంగా నాగార్జునను కూడా ఏటా తన సంపాదనలో కొంచెం జంతువుల సంరక్షణ కు ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టిందట . ఆశ్చర్యం ఏంటంటే ల నాగార్జున కూడా దీనికి ఓకే చెప్పారట . ఇప్పటికీ ఏటా తన సంపాదనలో నాగార్జున జంతువుల సంరక్షణ కు కొంచెం అమౌంట్ ఇచ్చేస్తాడట. ఈ ఒక్క విషయం చాలు అమలపై నాగార్జునకు ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి.